Veterinary Posts: పశుపోషణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం.. పాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరానా, దుధియా, బిట్టు గ్రామాల్లో పశువైద్య ఉప కేంద్రాలను రెండు నెలల్లో ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా స్పందిస్తూ మాట్లాడుతూ.. 1136 పశువుల సహాయకుల పోస్టుల భర్తీకి మార్చి 11, 2022 న రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ రిక్రూట్‌మెంట్ జారీ చేసిందన్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17 ఏప్రిల్ 2022. పరీక్షను 4 జూన్ 2022న నిర్వహించాలని ప్రతిపాదించబడింది. రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. దీంతో పశువుల పెంపకందారులకు మేలు జరుగుతుంది.
900 మంది వెటర్నరీ వైద్యుల నియామకానికి సంబంధించిన పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయని, అయితే ఫలితాలను మళ్లీ సేకరించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కోర్టు ఆదేశించిందని కటారియా చెప్పారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. కొత్త పశువైద్య సంస్థల ఏర్పాటు, నిర్బంధ స్వచ్ఛంద పదవీ విరమణ కారణంగా శాఖాపరమైన సంస్థల్లో ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఉద్యోగుల లభ్యతను బట్టి భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: గొర్రెల, పొట్టేళ్ల ఎంపికలో మెళకువలు
డిపార్ట్‌మెంట్ పేరుతో భూ యాజమాన్య పత్రాలు అందిన తర్వాత, ఆర్థిక వనరుల లభ్యత ప్రకారం, పశువైద్య సంస్థల కోసం రాష్ట్ర భవనాన్ని నిర్మించడం జరుగుతుందని కటారియా తెలియజేశారు.పాళీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంజూరైన పశువైద్యసంస్థలు, నిర్వహిస్తున్న పశువైద్య సంస్థల్లో మంజూరైన ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, కేటగిరీల వారీగా లొకేషన్ వారీగా పూర్తి సమాచారాన్ని వెల్లడించారాయన.
కాగా వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన రైతులందరి రుణాలను మాఫీ చేశామని సహకార శాఖ మంత్రి ఉదయలాల్ అంజన తెలిపారు.రైతులను రుణమాఫీ పథకంలో చేర్చినట్లు తెలిపారు. అదేవిధంగా పాలి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుకు చెందిన 18 వేల 558 మంది రైతులకు రూ.5205.96 లక్షల రుణాలు మాఫీ చేశామని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.ఇందుకు సంబంధించిన గ్రామాల వారీగా జాబితా వివరాలను పేర్కొన్నారు. రాజస్థాన్ స్టేట్ కో-ఆపరేటివ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా 37 మంది రుణగ్రహీతల మొత్తం రూ.30.28 లక్షల రుణాన్ని మాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు.
Also Read: వేసవిలో గుమ్మడికాయకు భారీ డిమాండ్