kitchen Gardening Tips: మన ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలను బయట నుండి కొనాల్సిన అవసరం లేకుండా, మన ఇంట్లో ఉన్న స్థలం లో స్వయంగా మనమే సాగు చేసే విధానాన్ని పెరటితోటల పెంపకం అంటారు. మనకి కావాల్సిన తాజా కూరగాయలను స్వయంగా పండించడమే పెరటి తోటల ముఖ్యోద్దేశం. ఇంట్లోవాళ్ళకి ఇదొక వ్యాపకంగా కూడా ఉంటుంది. పెరటి తోటల ద్వారా పెంచే కూరగాయలు ఎలాంటి రసాయనిక (పురుగు, తెగుళ్ల)మందుల అవశేషాలు లేకుండా లభిస్తాయి. అలాగే వాటిలో పోషకాల లభ్యత కూడా బాగుంటుంది. దీనిద్వారా కుటుంబ కూరగాయల ఖర్చు కూడా తగ్గుతుంది.
పెరటి తోటల ఆవశ్యకత:
మనం రోజూ తీసుకునే ఆహారం లో పోషకాల దృష్ట్యా పండ్లు కూరగాయలకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక మనిషి దాదాపుగా రోజుకి 300 గ్రా౹౹ ల కూరగాయలను ( అందులో 125 గ్రా౹౹ల ఆకుకూరలు,100 గ్రా౹౹ల దుంప కూరగాయలు, 75 గ్రా౹౹ల ఇతర కూరగాయలు) తీసుకోవాలి. అదేవిధంగా 120 గ్రా౹౹ల పండ్లను తీసుకోవాలి. పండ్లు ,కూరగాయల్లో మనకి కావాల్సిన ఖనిజలవణాలు ,విటమిన్ లు , పీచుపదార్థం పుష్కలంగా లభిస్తాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ఉత్పత్తుల కోసం రసాయనిక మందుల వాడకం విచ్చవిడిగా ఉండడం వల్ల వాటిపై క్రిమి సంహారక మందుల అవశేషాలు చేరుతున్నాయి.ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి ప్రస్తుత కాలం లో సేంద్రియ కూరగాయలు , ఆహారం పై అందరూ మొగ్గుచూపుతున్నందున పెరటి తోటల పెంపకం విశేష ఆవశ్యకతను సంతరించుకుంది.
Also Read: మిద్దెతోటని ఎలా మొదలు పెడితే బాగుంటుంది
పెరటి తోట పెంపకం కొరకు నేల తయారీ:
ఎంపిక చేసిన స్థలంలో రాళ్లు,గాజు పెంకులు లేకుండా శుభ్రం చేసి నేలను బాగా మెత్తగా పలుగుతో తవ్వాలి. ప్రతి చదరపు మీటర్ కి 2.5 కిలోల కంపోస్టు ఎరువుని కలపాలి. ప్రతీ చ.మీ మడికి నేలను చదును చేసేముందు 500 గ్రా౹౹ల సూపర్ ఫాస్ఫేట్, 2.5 గ్రా౹౹ల అమ్మోనియం సల్ఫేట్ ,125 గ్రా౹౹ల పోటాష్ ఎరువులను వేయాలి. తరువాత మొక్కల ఎదుగుదల దశలో 2-3 సార్లు 50 గ్రా౹౹ల యూరియా వేయాలి.
టమాటా,మిరప,వంగ ,క్యాబేజీ , కాలిఫ్లవర్ లాంటి కూరగాయలను నారు పెంచి నాటుకోవాలి. నారు పెంచడానిక్ తోటలో ఒక మూల 2.5 చ.కి.మీ విస్తీర్ణంలో 15 సెం. మీ ఎత్తులో ఉండే నారుమడిని తయారు చేసుకొని మడి లో నారుని పెంచి , 5-6 వారాల వయస్సు గల నారుని మడుల్లో నాటుకోవాలి.
బహువార్షిక మొక్కలైన కూర అరటి , నిమ్మ ,కరివేపాకు ,మునగ మొక్కలను తోటకి ఉత్తరదిశగా నాటుకోవడం వల్ల వాటి నీడ ఇతర కూరగాయలలై పడకుండా ఉంటుంది. మడులను వేరు చేసే గట్లను దుంప కూరగాయల (క్యారెట్ ,ముల్లంగి,బీట్ రూట్ )ను పెంచుటకు ఉపయోగించాలి.
కంపోస్టు గోతులను ఒక మూలలో ఏర్పాటు చేయాలి.తోటలోని చెత్తని ,ఇంటిలోని చెత్తని ఈ గోతుల్లో వేసి కప్పివేయాలి.అందువల్ల పెరటి తోటకి కావాల్సిన ఎరువు లభ్యత కూడా ఉంటుంది.
పెరటి తోట నిర్మాణ ప్రణాళిక:
తోటని చిన్న చిన్న మడులుగా విభజించి , వాటిలో వేయాల్సిన కూరగాయల రకాలు , కాలం ప్రణాళిక ను తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి సంవత్సరం పొడవునా నిత్యం కూరగాయలు లభించేలా చేసు కోవచ్చు. సాధారణంగా పెరటితోటలు పెంచుటకు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న పెరటి స్థలాన్ని ఎన్నుకోవాలి.
బోదె గట్లపైన క్యారెట్ ,ముల్లంగి ,బీట్ రూట్ వంటి కూరగాయలను వేసుకోవాలి. త్వరగా పక్వానిక్ వచ్చే కూరగాయలన్నింటిని ఒకేచోట విత్తడం వల్ల కాపు అయిపోయిన తరువాత స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తోటలోని అన్ని పంటలకు అవసరాన్ని బట్టి , నీళ్లు పెట్టి , ఎరువులు వేస్తూ ఉండాలి. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏవైనా ఆశిస్తే వాటిని నాశనము చేయాలి.కల్తీలేని మేలుజాతి కూరగాయ విత్తనాలని సేకరించుకోవాలి.వేయాల్సిన పంట లేదా వంగడం ఆయా ఋతువులని బట్టి ఉండాలి.
Also Read: మిద్దె తోటలలో టమాటా మొక్కల యాజమాన్యం