Summer Vegetable Cultivation Tips: ప్రథమంగా మనిషికి కావాలసిన పోషక పదార్థాలు అందించడంలో కూరగాయలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు మనిషి 320 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. ఇందులలో 100gm ఆకుకూరలు,100gm దుంపజాతికి చెందిన కూరగాయలు 70-80gm పండ్ల కూరగాయలు అనగ టమాట, వంగ, తీగ జాతికి చెందిన సోరకాయ, బీరకాయ తీసుకోవాలి. వేసవికి అనుగూనమైన కూరగాయలలో టొమాటో సంవత్సరం పాటు పెంచుకోవచ్చు.
కాని వేసవిలో వేసుకుంటె కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించుటకు ఆస్కారం ఉంటుంది. పూసారూబీ, అర్కవికాస్, మారుతమ్, పి.కె. ఎం -1 అనేవి వేసవికి అనుకూలమైన టొమాటో రకాలు. వీటితో పాటు ప్రభుత్వ రంగ హైబ్రిడ్స్ అయిన అర్క రక్షక్ , అర్క , అర్క అభేద్ కూడా మంచి దిగుబడులు ఇస్తున్నాయి. వీటిని ఇండియన్ న్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు విడుదల చేసారు. ఇవి కాకుండా తెలంగాణాలో ప్రైవేటు హైబ్రిడ్స్ర రకాలు అయిన యు.యస్ 440 ఉన్నాయి. యు.యస్ 440 , అవినాష్ , రూపాలీ, హింసోన కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
Also Read: రామకృష్ణాపురం కేరాఫ్ కూరగాయలు-టైమ్ పాస్ కోసం చేస్తే ఆరోగ్యం.. ఆదాయం
దాని తరువాత వంకాయ కూడా వేసవిలో వేసుకోవచ్చు. వేసవికి అనుకూనమైన రకాలలో శ్యామల , భాగ్యమతి , గులాబి అనేవి ఎక్కువగా నా ఏసుకుం టున్నారు. దీనితొ పాటుగా ప్రైవేటు హైబ్రిడ్స్ అయిన ఉత్యర్ష,కల్పతరు అనె రకాలు కూడా ఎక్కువ గా వాడుతున్నారు. పచ్చిమిర్చీలో భాగ్యలక్ష్మీ,అపర్ణ,సింధు అందుబాటులో ఉన్నాయి. మరియూ ప్రైవేటుషైబ్రిడ్ అయిన సోనాల్ అనె రకం కూడా ఎక్కువ గా ప్రాచుర్యంలో ఉంది.వీటితో పాటు బెండ కూడా వేసుకోవచ్చు.
దీనినీ ఫ్రీబ్రవరీ 15 నుండి చివరి వరకూ విత్తుకోవచ్చు.బెండలో అర్క అనామిక,ప్రతిభని క్రాంతి బాగా ప్రాచుర్యం లో ఉన్నాయి.మరియు ప్రైవేటు హైబ్రిడ్ అయిన రాధిక అనె రకం కూడా ఎక్కువ గా వాడుతారు.గోరుచిక్కుడు కూడా ఫిబ్రవరి 15నుండి మార్చులోపు వేసుకోవచ్చు.దీనిలో పూసా నవబహార్,పూసా సదా బీహార్ అనె రకాలు, ప్రైవేటు హైబ్రిడ్ అయిన గౌరి అనె రకం అందుబాటులో ఉన్నాయి.తీగజాతికి చెందిన కూరగాయలో బోర్,బీర్,కాకర కాయలు వేసుకోవచ్చు.
కాకర కాయలో పూసాదోమౌసమి, కోయంబత్తూర్ గ్రీన్ రకం ఎక్కువగా వాడుతున్నారు. సోరకాయలో అర్కబహార్,సామ్రాట్ అనె రకాలు ఎక్కువ గా వాడుతున్నారు.బీరలో అర్క సుజాత,అర్క ప్రసన్ అనేవి అందుబాటులో ఉన్నాయి.వీటి తరువాత ఆకుకూరలు ముఖ్యమైనవి.ఇందులో గోంగూరకు రైతులు లోకల్ వెరైటీలు ఎక్కువగా ఉపయోగిస్తారు.మెంతికూరలో పూసా ఎర్లీబంచ్ అనేది ఎక్కువగా వాడుతారు.లామ్ సెలక్షన్,మిస్సాల్ అరుణ అనె రకాలు కూడా వాడుతున్నారు.తరువాత కొత్తిమీర లో కో-1,కో-2(కోయంబత్తూర్) అనేవి ఇంకా సాధన స్వాతి అనే రకాలు దీనికి అనుకూనమైనవి.
పాలకూరలో ఆల్ గ్రీన్, పూసాజ్యోతి,పూసా సరిత్, జాఫ్నర్ గ్రీన్ అనే రకాలు ఉపయోగిస్తున్నారు.ఇవి వేసవిలో వేసుకోవడం వల్ల మంచి లాభాలు వస్తాయి. కూరగాయలు పెంచె అప్పుడు భూమి తయారు చేసుకునే అప్పుడు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 200kg లో వేపిండి,2kgల జీవన ఎరువులు అనగా(అజాతోబాక్టర్, సుడోమోనాస్ )అనేవి పశువుల ఎరువులో వృద్ధి చేసుకొని పొలంలో వేసుకుంటె మంచి దిగుబడి రావడమేగాక చీడ పీడలు బెడద కూడా కొంచెం తక్కువగా ఉంటుంది.
వేసవిలో రకాలకు అయితే 200-300gmల విత్తనాలు మరియు హైబ్రికి అయితే 80-100gm విత్తనము, గోరుచిక్కుడుకి ఎకరానికి 4-6kg విత్తనము అవసరం అవుతుంది.తీగజాతి కూరగాయలకు 2kgల విత్తనము అవసరం అవుతుంది.ఆకుకూరలో తోటకూరకి ఎకరానికి 2kgల విత్తనం అవసరం అవుతుంది.మిగితావాటికి అనగా గోంగూర,పాలకూర,మెంతికూర,ధాన్యాలు కు ఎకరానికి 10kgల విత్తనం అవసరం అవుతుంది.మిగితాకాలాల కంటె వేసవిలో మొక్కలను కొంచెం దెగ్గరగా నాటుకోవాలి.
టమాట, వంగ, మిరప కు నేల రకం నుంచి బట్టి వరుసలో మధ్య దూరం 60cm , మొక్కల మధ్య దూరాన్ని 30-40cmల ధూరం పెట్టుకోవాలి.తీగజాతి కూరగాయలకు 1-2 మీటర్లు వరుసల మధ్య దూరం,60-90cm మొక్కల మధ్య ఉండవలసిన దూరం.బెండకాయకు 45×30-40cm దూరం ఉంచుకోవచ్చు.ఆకుకూరలో 10×10cm లేదా 10×5-10cm దూరం ఉంచుకోవచ్చు.మాములు పద్ధతిలో టమాటాలు ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది.అలా కాకుండా డ్రిప్ ఇరిగేషన్,మల్చింగ్,ట్రెలిసింగ్ పద్ధతుల్లో సాగు చేసుకుంటె టమాటాకు ఎకరాకు 60-70 వేల ఖర్చు అవుతుంది.కాని ఈ పద్ధతిలో ఒక్క మొక్క నుండి దాదాపు 15kg లో దిగుబడి వస్తుంది.
Also Read: డాబాపై కూరగాయల పెంపకం..