Spirulina Farming: భవిష్యత్తులో సముద్రాలే ఆహారాన్ని అందించే వనరులు కానున్నాయి. సిడ్నీలోని జార్విస్ లో సముద్ర నాచును పెంచుతున్నారు. సముద్ర నాచులో ఫైబర్, ఒమెగా3 ఉంటాయి. అటు ఆస్ట్రేలియాలోని నేలపై కనిపించే భిన్నమైన మొక్కలు, జంతువుల్లాగే సముద్రంలో ప్రత్యేకమైన నాచు లభిస్తుంది. అటువంటి సముద్ర నాచు ప్రపంచంలో ఇంకెక్కడా లభించదు. సముద్ర నాచును పెద్ద ట్యాంకుల్లోను పెంచొచ్చు. గోధుమల ప్రోసెసింగ్ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కార్బన్డయాక్సయిడ్ ను ఈ ట్యాంకుల్లోని నాచు పీల్చుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యాపారం చిన్నస్థాయిల్లోనే ఉంది. కాకపోతే సాంప్రదాయ వ్యవసాయం వల్ల జీవావరణంపై పడే ప్రభావాన్ని ఇది తగ్గించగలదు.
Also Read: Coral Reef Degradation: ప్రమాదంలో పగడపు దిబ్బలు.!
బ్రేడ్ మరియు పాస్తాలో సముద్ర నాచును ఉపయోగిస్తే 10 లక్షల హెక్టార్ల భూమిని కాపాడవచ్చు. ఇక బ్లూ ఎకనామికి మరో వనరులు ఏంటంటే సముద్రంలో ముళ్ళు ఉండే అర్చిన్స్. అయితే ఇవి సముద్ర జీవులకు నష్టం కలిగించవచ్చు. అయితే ఇప్పుడు ఆ అర్చిన్స్ ఇబ్బంది కారకులుగా కాకుండా రుచికరంగా మారాయి. అర్చిన్స్ ని సముద్రం నుండి సేకరించి భిన్నమైన ఆక్వా కల్చర్లో పెంచుతున్నారు కొందరు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న పెద్ద రెస్టారెంట్లకు వాటిని అమ్ముతున్నారు. కాగా.. ఈ సూపర్ ఫుడ్ మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారంగా మిగిలిపోతోంది. ఇప్పుడిప్పుడే శాస్త్రీయ పద్ధతుల్లో నాచును పెంచేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇకపోతే ఆస్ట్రేలియాలో ఆక్వా కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎకానమిక్ జోన్ ఉంది. ఆ దేశంలో రెండు పెద్ద సముద్రాలు ఉన్నాయి.
2050 నాటికి భూమి మీద 1000 కోట్ల మంది ప్రజలు ఉంటారని నిపుణులు చెప్తున్నారు. అయితే వారికి భవిష్యత్తులో తినడానికి సగం ఆహారం సముద్రం నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో బ్లూ ఎకానమీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సముద్రం నుంచి సంపదను సృష్టించాలి. అదే సమయంలో సముద్రానికి హాని కలగకుండా జాగ్రత్త పడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే త్వరలో మహాసముద్రలు అన్నీ ఆర్ధిక సముద్రలుగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు.
Also Read: 300 కిలోల కంబాల టేకు చేప