Gulkand Benefits: వ్యవసాయంలో సేంద్రియ విధానం కీలక పాత్ర పోషిస్తుంది. రసాయన ఎరువులతో పండించిన పంటకు కాలం చెల్లింది. ప్రస్తుతం అందరూ సేంద్రియ పద్దతిలోనే సాగు చేయాలని అనుకుంటున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా చేయూత అందించడం శుభపరిణామం. కాగా.. సేంద్రియ విధానంలో గులాబీ సాగు చేసి ఆ గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్ తయారు చేస్తున్నారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన బెన్.
శంషాద్ జాకీర్ హుస్సేన్ బెన్ గుజరాత్ లోని నవసారి జిల్లా కేర్ గ్రామంలో నివసిస్తారు. ఆమె గులాబీలతో గుల్కండ్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సేంద్రియ పద్దతిలోసాగు చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఆమె ద్వారా మరికొంత మందికి కూడా ఉపాధి కలగాలనేది బెన్ కోరిక. 2017 లో ఆమె గులాబీ సాగు మొదలు పెట్టినట్లు తెలిపారు. బెన్ మాట్లాడుతూ… గులాబీ సాగుకు ముందు కూరగాయలు పండించేవాళ్ళం. ఆదాయం పెంచుకునేందుకు ఏదైనా కొత్తగా సాగు చేయాలనీ నేను నా భర్త అనుకున్నాము. మేము సాగు చేసే ప్రతీది ప్రజలకు ఉపయోగపడాలనేది మా కోరిక. మొదట్లో మేము గులాబీ మొక్కలు పెంచి గులాబీ రేకులతో గుల్కండ్ తయారు చేసుకుని తినేవాళ్ళం. ఒకసారి నా భర్త నవసారి జిల్లా వ్యవసాయ అధికారిని కలిశారు. ఆయనకు మేము తయారు చేసిన గుల్కండ్ రుచి చుపించాము. అయితే గుల్కండ్ రుచి ఎంతో బాగుందని, దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని మాకు సలహాలు, సూచనలు ఇచ్చారని బెన్ గుర్తు చేసుకున్నారు.
Also Read: పాలీహౌస్ లలో సాంకేతిక పద్దతిలో గులాబీ సాగు
గులాబీ పంటను సేంద్రియ విధానంలోనే పండించేవాళ్ళం. నేల సారవంతంగా ఉంటూనే అధిక దిగుబడినిచ్చేందుకు ఆమె కేవలం ఆవుల వ్యర్ధాలతో తయారు చేసిన కంపోస్టునే వాడుతారు. ఈ విధానం ద్వారా గుల్కండ్ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే గుల్కండ్ తయారీకి పట్టే సమయం మాత్రం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం వేడిగా ఉంటే కేజీ గుల్కండ్ తయారీకి 22 రోజుల సమయం పడుతుంది. వేడి సాధారణ స్థితిలో ఉంటే దాదాపుగా రెండు నెలల సమయం పడుతుందని చెప్తున్నారు ఆమె. గుల్కండ్ ఎసిడిటి, అల్సర్ లాంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఇకపోతే గులాబీ పూరేకలతో చేసే ఈ జామ్ చూడగానే తినాలన్నంత ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. రుచి, సువాసనను కూడా కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు, అంతేకాకుండా చెమట కారణంగా కుదుళ్లలో దురద, చర్మంపై పగుళ్లు సమస్య నుండి ఉపశమన కలిగిస్తుంది. అంతేకాదు.. మహిళలకు సంబంధించిన నెలసరి సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది.
Also Read: వేసవిలో గులాబీ మొక్కల సంరక్షణ