Jeevamrutham Preparation: జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే, భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పింవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. దేశీ లేదా నాటు ఆవుపేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ జీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది. ఈ జీవామృతమును ద్రవ, ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు .
Also Read: సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం !
జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు: ఒక ఎకరం పంటకి
- డ్రమ్ము – నీళ్ళు పట్టేది
- నీళ్ళు – 200 లీటర్లు (సుమారుగా 15 బిందెలు),
- ఆవు పేడ-10 కిలోలు,
- ఆవుమూత్రం-10 లీటర్లు,
- పప్పు దినుసుల పిండి-2 కిలోలు,
- బెల్లం-2 కిలోలు,
- గట్టు మట్టి-గుప్పెడు.
తయారు చేయువిధానం:
మొదట డ్రమ్ములో 200 లీటర్ల (సుమారుగా 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో 10లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రములో కలుపుకోవాలి. 2 కేజీలు పప్పు దినుసుల పిండిని కలుపుకోవాలి. 2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. గట్టుమట్టిని గుప్పెడు కలుపుకోవాలి. ఈ అన్ని కలుపుకున్న మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి.
దీనిని నాలుగు రోజులు మురగనివ్వాలి. దీనిని నాలుగు రోజులు రోజుకు మూడుసార్లు ఉదయం, మధ్యానం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. నాలుగు రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన లాభాలు పంటకు బలాన్నిస్తుంది. దీనిని తయారు చేయుటప్పుడు ముందు జాగ్రత్తచర్యలుగా ఆరోగ్యకరమయిన దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రం తీసుకోవాలి. దీనిలో ఏమియు కలుపకూడదు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు పెట్టె కాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం ఒక ఎకరాకు పనిచేస్తుంది.
Also Read: సేంద్రియ సేద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు..