Youth and Agriculture: వ్యవసాయం దండగ కాదు. పండుగ అని నిరూపిస్తున్నారు కాలేజి విద్యార్థులు. ఈ రోజుల్లో వ్యవసాయం అంటేనే దూరంగా పోతున్న వారు కొంతమంది అయితే, పెట్టిన పెట్టుబడులు రాక కాడిని వదిలివేసిన వారు మరి కొంతమంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యవసాయ పనుల్లో విద్యార్థులు చాలా బిజీగా ఉన్నారు. సొంత పొలాలతో పాటు ఇతర పొలాల్లో కూడా నాట్లు వేస్తున్నారు. ఇలా పని చేయడం ద్వారా మా చదువులకు ఎంతో కొంత సహాయ పడుతుందని అంటున్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓ పక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటు పలువురి మన్ననలు పొందుతున్నారు.

Building a career in agriculture and farming sector
Also Read: Organic Farming Products: ప్రపంచ మార్కెట్లో సేంద్రియ పంటలకు గిరాకీ ఎక్కువ.!
దేశానికి అన్నం పెట్టే అన్నదాతను గౌరవిద్దాం
వ్యవసాయమంటే చిన్నచూపు కాదని.. దేశానికి అన్నం పెట్టే అన్నదాత లంటూ గౌరవంగా చెబుతూ పనులను చేస్తున్నారు. వలస కూలీల కంటే వేగంగా వరినాట్లు వేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలువురు యువతలు పనులు చేస్తూ చదువుకయ్యే ఖర్చులను సంపాదించుకుంటున్నారు. కూలీల కొరత నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్గడ్, బీహార్‌లకు చెందిన వలస కూలీలు వ్యవసాయ పనులు చేసేందుకు వస్తున్నారు. అయితే వారితో పాటు విద్యార్థులు కూడా పనులు చేస్తూ సంపాదించుకుంటున్నారు. నాటేయడంలో తామేమీ తక్కువ కాదని యువతలు కూలీలతో పోటీపడుతున్నారు. ఓపక్క చదువుకుంటూ …మరోపక్క వ్యవసాయంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నారు. స్నేహితులతో కలిసి నాటేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. నాటేయటంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మడుల్లో నాటేసి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

Youth in Agriculture
తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ
వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నాట్లు వేస్తున్నారు. ఒక ఎకరానికి నాటేందుకు రూ.5 వేల వరకు కూలీ చెల్లిస్తున్నామని, కూలీలకొరతతో ఇతర రాష్ట్రాలకు నుండి వస్తున్నారని, వీరికి ఆధిక రేట్లు ఇచ్చి నాట్లు వేయించుకుంటున్నారు, దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయాని అంటున్నారు. ఈవిషయాన్ని గమనించిన యువకులు వలస కూలీలు డిమాండ్ చేసే అవకాశం ఇవ్వకుండా. వారే వ్యవసాయ పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నామని పొలం దున్నడం, నాటేయడం, పండిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే వరకు అన్నింటిలో పనులు చేస్తామని విద్యార్థులు అంటున్నారు. చదువుతోపాటు వ్యవసాయ పనులు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందన్నారు.
Also Read: Indian Tea Prices: భారతీయ తేయాకు ధరలు తగ్గుముఖం.!