వార్తలు

Natural Disasters on Agriculture: రైతు గోడు పట్టేదెవరికీ? ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం మరో వైపు.!

2
The impact of natural hazards and disasters on agriculture
The impact of natural hazards and disasters on agriculture

Natural Disasters on Agriculture: దేశంలో సగానికిపైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. కానీ రైతు గోస ఎవరికీ పట్టదు. విత్తనం వేసిన నాటి నుంచి మార్కెట్‌లో అమ్ముకునేవరకు అన్నదాతకు కష్టాలే. విత్తనం, ఎరువులు, పురుగు మందుల విషయంలో కొందరు వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే, సౌకర్యాలు కల్పించడంలో పాలకులు చిన్నచూపు. చివరకు పగబట్టిన ప్రకృతి కూడా రైతన్నను కోలుకోలేని దెబ్బతీస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలను దాటుకొని రైతులు తాము పండిరచిన పంట చేతికి రావడంతో అన్నదాత మోములో ఆనందం వ్యక్తమైంది. సంతోషంగా పంటను కోసి.. నూర్పిడి చేసి.. అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకువెళితే మార్కెట్‌ మొత్తం ధాన్యపు రాశులే. తూకం వేసిన ధాన్యం బస్తాలే. రైతు తన కష్టం అంతా సొమ్ము రూపంలో చేతికి అందుతుంది అనుకునే సమయంలో ఆగ్రహించిన వరణుడు అకాల వర్షం రూపంలో విరుచుకు పడ్డాడు. దీంతో మార్కెట్‌ యార్డులో ఉన్న ధాన్యం రాశులు, బస్తాలు తడిసిసోయాయి. అకాల వర్షానికి వరద మొత్తం యార్డును ముంచెత్తింది. ధాన్యపు రాశులన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతున్నా రైతులు చూస్తూ కన్నీరు పెట్టుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రైతుల పరిస్థితి ఇలానే ఉంది. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం కూడా చివరకు సొమ్ముగా మారి తన చేతికి అందుతుందన్న నమ్మకం లేని పరిస్థితి రైతులది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యాణా, ఒడిశా ఇలా ఏ రాష్ట్రం చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇటీవల మహారాష్ట్రలో ఉల్లి రైతులు అయితే పెద్ద ఉద్యమమే చేశారు. మార్కెట్‌ యార్డులకు తెచ్చిన పంటలను కూడా కాపాడుకోలేని స్థితికి ఎవరిని నిందించాలి.

Also Read: Farmer Success Story: బోడ కాకర సాగుతో భలే లాభాలు – సింగభూపాలెం రైతు విజయ గాధ

Natural Disasters on Agriculture

Natural Disasters on Agriculture

మరోవైపు కొన్ని చోట్ల దళారుల దోపిడీ. ఒకవైపు రైతులు ప్రకృతి వైపరీత్యాలు, తెగులుళ్లను ఎదురించి పంటలు పండిస్తే.. మార్కెట్‌కు తెచ్చిన తర్వాత దళారులు చెప్పిన ధరకే అమ్ముకునే పరిస్థితి. కేంద్రం పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నా. నాణ్యత, తేమ, ఇతర కారణాలతో దళారులు మద్దతు ధర చెల్లించడం లేదు. దీంతో పంటను నిల్వ చేసుకునే వెసులుబటు లేని రైతులు దళారి చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది పత్తి ధర పడిపోవడంతో తెలంగాణలో రైతులంతా పత్తిని ఇళ్లలోనే నిల్వ చేశారు. ఈ పరిస్థితిని గమనించిన దళారులు కుమ్మక్కై ధర పెంచడం లేదు. కారణం ఏంటంటే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం సాకుగా చెబుతున్నారు. దీంతో దాదాపు ఆరు నెలలుగా పత్తి రైతుల ఇళ్లలోనే నిల్వ ఉంది. మరోవైపు ఎండలుకు చిన్నపాటి నిప్పు పడినా పత్తితోపాటు ఇల్లు కాలి బూడిదైయ్యే పరిస్థితి. ఇక అకాల వర్షాలకు నిల్వ ఉంచిన పత్తితో తేమ వచ్చి. నల్లబడి పోతోంది. నాణ్యత దెబ్బతింటోది. చివరకు దళారులనే ఆశ్రయించాల్సి వస్తోంది.

పంటల విక్రయం ద్వారా మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేసే చెక్‌ పోస్టుల ద్వారా మార్కెట్లకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినా యార్డుల్లో సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు అన్నదాత గోసను మాత్రం పట్టించుకోవడం లేదు. పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నామని సౌకర్యాలను గాలికి వదిలేశారు. దళారులు నిలువునా దోచుకుంటున్నా చోద్యం చూస్తున్నారు.

ఆరుగాలం రెక్కల కష్టం చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిరచిన పంట కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతుండడంతో రైతుల పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ చలించిపోతారు. ప్రతి కన్ను చెమరుస్తుంది. రెండు మూడు రోజుల్లో ధాన్యం అమ్మితేనే ఆ రైతు సాగు కోసం చేసిన అప్పులు తీరేది. ఆ ధాన్యం అమ్మిన డబ్బులు వస్తేనే పిల్లల ఫీజులు కట్టేది. ఆ డబ్బులతోనే ఏడాదంతా ఇల్లు గడిచేది. కానీ, చివరికి కన్నీరు తప్ప రైతులకు ఏమీ మిగలలేదు. పాలకుల నిర్లక్ష్యానికి, పాలనా వైఫల్యానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైతులు సరైన వసతులు లేక నష్టపోయినా ప్రభుత్వ అధికారులు గాని, నేతలు గాని అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇంత నష్టం జరిగినా ఎవరూ పట్టించుకోకపోయినా మళ్లీ చినుకు పడగానే రైతు పొలం బాట పట్టాల్సిందే.

Also  Read: Palamuru – Rangareddy Lift Scheme: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణ ప్రజల దశాబ్దపు కల నెరవేరుతున్నది – మంత్రి

Leave Your Comments

Farmer Success Story: బోడ కాకర సాగుతో భలే లాభాలు – సింగభూపాలెం రైతు విజయ గాధ

Previous article

Tikka Leafspot in Rabi Groundnut: రబీ వేరుశనగలో ‘‘తిక్కాకు మచ్చ’’ తెగుళ్ల యాజమాన్యం

Next article

You may also like