Oil Palm : ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- మద్దతు ధర పెంపుతో ఆయిల్ పామ్ రైతుల హర్షం
- ఏపి ప్రభుత్వ కృషితో కేంద్రం చర్యలు
- దిగుమతి సుంకం 5.5 నుంచి 27.5 పెంపుతో పెరిగిన క్రూడ్ ఆయిల్ పామ్ ధర
- టన్ను రూ.13,950 నుంచి రూ.16,930 పెరుగుదల
ఆయిల్ పామ్ మద్దతు ధర పెంపుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులకు మద్దతు ధర పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, ఆ మేరకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచడంతో ఆయిల్ పామ్ క్రూడ్ ఆయిల్ ధర టన్ను రూ.85,488 నుంచి రూ.1,04,126 కు పెరిగిందని మంత్రి వెల్లడించారు. దీంతో ఆయిల్ పామ్ రైతులకు టన్నుకు అదనంగా రూ.2980 ధర పెరిగి (టన్ను రూ.13,950 నుంచి రూ.16,930 లకు) రూ.16,930 రైతులకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని త్వరలో ఆయిల్ పామ్ పరిశ్రమ వృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Leave Your Comments