వార్తలు

PJTSAUలో జూన్ 10వ తేదీన ఆరవ స్నాతకోత్సవ వేడుకలు

0

PJTSAU 6th Convocation : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)ఆరవ స్నాతకోత్సవం జూన్ 10 వ తేదీ (సోమవారం) జరగనుంది. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఇది జరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, APC, PJTSAU ఇన్చార్జి ఉపకులపతి ఎం. రఘునందన్ రావు, IAS తెలిపారు. తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి C.P రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగుతుందని, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి ముఖ్యఅతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారని రఘునందన్ రావు వివరించారు. 587 విద్యార్థులకి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలని, 165 విద్యార్థులకి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలని అందజేయనున్నట్లు తెలిపారు. 11 మంది PG, PHD విద్యార్థులు, 8 మంది UG విద్యార్థులు బంగారు పథకాలు పొందనున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Leave Your Comments

జూన్ 8 నుండి 12 వరకు వరకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు?

Previous article

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ

Next article

You may also like