సాంకేతిక సమస్యకు పరిష్కారం …
Onion sales : ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ
గత వరం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో క్రయవిక్రయాలు జరిగే ఈ-నామ్ నందు సాంకేతిక సమస్య కారణంగా టెండరు జరిపేందుకు ఇబ్బంది పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామాత్యులు కింజరపు అచ్చెంనాయుడు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి టెండరు విధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించారు.
Read More : http://ఖరీఫ్ ఉల్లి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే…
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు మార్కెట్ యార్డు నందు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారస్థులతో సమీక్ష సమావేశము నిర్వహించి క్రయవిక్రయాలు అయిపోయినటువంటి ఉల్లిగడ్డలను వాహనాల ద్వారా త్వరగా బయటకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రోజు(అక్టోబర్ 28 న) కర్నూలు మార్కెట్ యార్డుకు 43,000 బస్తాల ఉల్లిగడ్డలు క్రయవిక్రయానికి వచ్చాయి. ఈ-నామ్ నందు సాంకేతిక సమస్య పరిష్కారము కావడంతో ఈరోజు క్రయవిక్రయాలు ఆన్లైన్ పద్దతిలో జరిగాయి. క్రయవిక్రయాలు జరిగిన ఉల్లిగడ్డలను త్వరగా బయటకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.