ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Durga Devi About Natural Farming: క్యాన్సర్‌ తీవ్రతను తగ్గించిన ప్రకృతి వ్యవసాయం

0
Durga Devi About Natural Farming

Durga Devi Family

Durga Devi About Natural Farming: ఇది 32 ఏళ్ల వయసు గల ఎం . దుర్గాదేవి కథ. రక్త క్యాన్సర్‌ను నయం చేయడంలో ప్రకృతి వ్యవసాయం ఎలా సహాయపడిందో మనం పరిశీలించవచ్చు. 9 సంవత్సరాల వయస్సులో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నతమ కుమార్తె చికిత్స కోసం దుర్గాదేవి కుటుంబం ఆస్తులన్నింటినీ అమ్మి సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిట్ట చివరగా కౌలు భూమిలో అనుసరించిన ప్రకృతి వ్యవసాయ విధానంలో పరిష్కారాన్నికనుగొన్నారు. గతంలో చికిత్స కోసం నెలకు రెండుసార్లు చెన్నై నగరంలోని డాక్టర్‌ని కలిసేవారు, ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి మాత్రమే డాక్టర్‌ని సంప్రదిస్తున్నారు. వైద్యులు కూడా అమ్మాయి ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదలని చూసి ఆశ్చర్యపోయారు.

షెడ్యూల్డ్ కులానికి చెందిన ఎం.దుర్గాదేవి తన కుటుంబంతో బాపట్ల జిల్లా గోవాడ గ్రామంలో నివసిస్తోంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఆమెకు ఎం. సాయిరామ్‌తో వివాహం జరిగింది. అప్పటి నుంచి వ్యవసాయంలో తన భర్తకు సహాయం చేస్తూ వస్తోంది. తమకున్న 1.5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకొంటూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. 2016లో దుర్గ దేవి పెద్ద కుమార్తె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అమ్మాయి రిపోర్టులను పరిశీలించిన వైద్యులు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. అకస్మాత్తుగా బయటపడ్డ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి దుర్గాదేవి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైంది.కూతురు చికిత్స కోసం దుర్గ దేవి కుటుంబం ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. చికిత్స కోసం కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఫలితాలు మాత్రం మారలేదు. చికిత్స ఖర్చుల కోసం తమ 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మేశారు.

Durga Devi About Natural Farming

ఆసుపత్రికి నిరంతరం సందర్శిస్తూ చివరకు ఆశ కోల్పోయే దశకు చేరుకున్నారు. చివరకు జీవనోపాధి కూడా కష్టమని భావించారు. SHG సమావేశంలో భాగంగా, దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయం (NF) గురించి తెలుసుకున్నారు. APCNF ప్రాజెక్ట్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల కలిగే ఆరోగ్య మరియు పోషకాహార ప్రయోజనాలను వివరించారు. ఆ సమావేశం అనంతరం వారి జీవితంలో ఓ చిన్న ఆశ వెలుగుచూసింది. 2018లో కిచెన్ గార్డెన్‌తో పాటు వరి పొలం కూడా నిర్వహించడానికి 1 ఎకరం మరియు 1 సెంటు భూమిని లీజుకు తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి కూరగాయలు మరియు వరి సాగు ప్రారంభించారు. ఇది శ్రమతో కూడుకున్నప్పటికీ, దుర్గాదేవి మరియు ఆమె భర్త పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంనే అనుసరించారు. ప్రకృతి వ్యవసాయ ఆహారాన్ని మాత్రమే తినడం ప్రారంభించారు. ఆ సమయంలో మ కూతురు ఆరోగ్యంలో వచ్చిన మార్పును గమనించారు. క్రమంగా వైద్యులతో సంప్రదింపులు బాగా తగ్గిపోయాయి. 3 నెలలకు ఒకసారి వెళ్ళే దశకు చేరుకొన్నారు.

” బ్లడ్ క్యాన్సర్ అనే పదం నుంచి ఇప్పుడు పూర్తిగా విముక్తి పొందాం. నా కూతురు 10వ తరగతి చదువుతోంది. మా వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వచ్చామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కుటుంబ పోషణ తర్వాత మిగిలిపోయిన కూరగాయలను అమ్ముతున్నాం. కొన్ని కూరగాయలను ఇరుగుపొరుగు వారికి మరియు తోటి ఎస్‌హెచ్‌జి సభ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మేము (నా కుటుంబం) APCNF క్యాడర్‌కు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను నా తోటి SHG సభ్యులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరిస్తూ ప్రోత్సహిస్తున్నాను. అని దుర్గాదేవి తన అభిప్రాయం వెలిబుచ్చింది.

గమనించిన ప్రధాన మార్పులు:

ఆదాయ వ్యయ వివరాలు

Leave Your Comments

Success Story Of lady Farmer Haritha: “భార్య ప్రకృతి వ్యవసాయం.. భర్త రసాయన వ్యవసాయం ”

Previous article

Krishnamurthy Success Story: ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణమూర్తి

Next article

You may also like