Buy Cow Dung Cake Online: రైతులు తక్కువ సమయంలో ఎక్కువ పంటను పండించాలి అని రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ఒకటి లేదా రెండు పంటల దిగుబడి మంచిగా వస్తుంది. తర్వాత భూసారం తగ్గిపోతుంది, దానితో దిగుబడి కూడా తగ్గుతుంది. భూసారం తగ్గడంతో రైతులు మళ్ళీ సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి అనుకుంటున్నారు.
సేంద్రియ ఎరువుల కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ సరైన సమయానికి ఎరువులు అందించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థిని అనువుగా తీసుకొని బెగుసరాయ్ ప్రాంతంలోని రైతు ముని లాల్ మహ సేంద్రియ ఎరువులని రైతులకి సరైన సమయానికి, సరైన ధరకి అందిస్తున్నారు. ఇతను చేసే వ్యవసాయం మొత్తం సేంద్రియ పద్దతిలోనే చేస్తాడు. ఇతర రైతులకి ఈ పద్దతిలో వ్యవసాయం చెయ్యడానికి శిక్షణ కూడా ఇస్తున్నారు.
Also Read: Pure Ghee: స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడం ఎలా..?
మునిలాల్ రైతులకి సేంద్రియ ఎరువులు కావాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ ప్రకారం సరైన సమయానికి రైతులకి ఎరువులని అందిస్తారు. మార్కెట్లో రసాయన ఎరువులు కిలో 40 రూపాయలకి అమ్ముతున్నారు. కానీ మునిలాల్ సేంద్రియ ఎరువులు కిలో 6 రూపాయలకే అమ్ముతున్నారు. మునిలాల్కి ఈ ఎరువులు అమ్ముకుంటూ సంవత్సరానికి 60-70 వేల వరకు లాభాలు వస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడితే పంటకి 6-7 సార్లు వరకు నీళ్లు అందించాలి. కానీ సేంద్రియ ఎరువులు వేస్తే పంటకి 3 సార్లు మాత్రమే నీళ్లు అందించాలి.
ఇతను సేంద్రియ అరువులే కాకుండా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇతను ఇచ్చే శిక్షణతో చాలా మంది రైతులు వారి పొలంలో మంచి దిగుబడి వచ్చి, బారి లాభాలని పొందుతున్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటకి మార్కెట్లో కూడా మంచి రేట్ వస్తున్నాయి. దీంతో రైతులు అందరూ సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి అనుకుంటున్నారు.
Also Read: Sarugudu Cultivation: రైతుకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ‘సరుగుడు సాగు’