Rice Under Threat: ప్రపంచాన్ని పోషించే పంటగా వరి పంటను అంటారు. ప్రపంచంలోని చాలా మందికి జీవనోపాధిగా వరి పంటను సాగు చేస్తున్నారు. మనం పంచించే వరి పంట మొత్తం ఆగి పోతే…? వేరే పంటలతో ప్రపంచ జనాభా బ్రతుకుతుందా …? ఇప్పుడు వరి పంటకి వచ్చిన ముప్పు వల్ల ఈ ప్రశ్నలు అన్ని వస్తున్నాయి. అసలు వరి పంటకి ముప్పు ఎందుకు వస్తుంది.
ప్రతి సంవత్సరం భూమి వేడి పెరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వేసవి కలం ఎండలు చాలా ఎక్కువ పెరిగాయి. గ్లోబల్ వార్మింగ్‌తో భూమి నుంచి ఎక్కవ వేడి వస్తుంది. భూమి వేడి ఎక్కడంతో రాత్రులు వెచ్చగానే ఉంటుంది. దీని వల్ల వరి దిగుబడి తగ్గుతుంది.
గత రెండు, మూడు సంవత్సరాల నుంచి వర్ష కాలంలో కూడా వర్షాలు తొందరగా అయిన లేదా ఆలస్యంగా అయిన వస్తున్నాయి. వరి పంట మొక్కకైతే సమయంలో వర్షాలు రాకపోవడం వల్ల మొల్లకలు ఎండిపోతున్నాయి. వరి పంట కోత సమయంలో ఎక్కువ వర్షాలు రావడంతో పంట వర్షంలో మునిగి పోతుంది. కొన్ని ప్రాంతాల్లో సముద్రంలోని నీరు పంటలోకి రావడం వల్ల సముద్రపు ఉప్పు కూడా వారి పంటని నాశనం చేస్తుంది.
ఈ పరిస్థితులు చూసాక రైతులు వరి పంటని పండించడానికి కొత్త మార్గాలని వెతుకుంటున్నారు. అలాగే రైతులు వరి పంట నాటే సమయాన్ని కూడా మార్చుకుంటున్నారు ఈ ముప్పులు అన్ని తగ్గించుకోవడానికి. శాత్రవేత్తలు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత, ఉప్పు నేలలను తట్టుకునే విత్తనాలు తయారీ చేయడానికి ప్రయోగాలు చేస్తున్నారు.
Also Read: Cauliflower Cultivation: రంగు రంగుల కాలీఫ్లవర్ మీరు సాగు చెయ్యాలి అనుకుంటున్నారా.?
వర్షం ఫై ఆధార పడి వరి పంట పండించే రైతులు పంట తర్వాత వరి పొలంని కావాలని ఎండపెడుతున్నారు దీని వల్ల వరి పంట నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ విడుదల తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న ప్రపంచ జనాభాకి సరిపోయే వరి పంట కోసం రైతులు హైబ్రిడ్ విత్తనాలు, ఎక్కువ దిగుబడి కోసం ఫెర్టిలైజర్స్ ఎక్కువ శాతంలో వాడుతున్నారు. వరి మొక్కకి అవసరం ఉన్నంత మాత్రమే ఫర్టిలైజర్ వాడుకొని మిగితాది పొలంలో ఉండిపోతుంది. దానితో నెల నాణ్యత పోతుంది, pH పెరిగి నెల ఆసిడ్‌గా మారుతుంది.
వరి పంట కోతలు అయ్యాక వరి గాడిని కాల్చడం వల్ల గాలిలో పొల్యూషన్ పెరిగి మన వాతావరణంలోను, వర్షాలు పాడడంలో మార్పులు రావడంతో వరి పంట దిగుబడి తగ్గుతుంది. వరి పంట నుంచి మీథేన్ విడుదలు అవడం వల్ల మన వాతావరణంలో మీథేన్, కార్బొన్దియోక్సిడ్ ఎక్కువ ఆయె వరి పంటలోని న్యూట్రిఎంట్స్ కూడా తగ్గుతున్నాయి.
Also Read: Seed Conservation: అంతరించిపోయే పంట విత్తనాలు దాచుకోవడం ఎలా.!