Moraxella Bovis Disease in Cattle: వ్యాధి కారకం:-
(1) ఇది “మోరెక్సెల్లా బోవిస్” అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది.
(2) ఇది కర్ర ఆకారంలో ఉండి, గాలి సహిత పరిస్థితులలో పెరుగుతుంది.
Also Read: Wooden Tongue Disease in Cattle: ఆవులలో వచ్చే నాలుక వాపు వ్యాధి నివారణ చర్యలు.!
వ్యాధి బారిన పడు పశువులు:- యుక్తవయసులోని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో సోకుతుంది.
వ్యాధి వచ్చు మార్గాలు:-
(1) వ్యాధి వచ్చిన పశువు యొక్క కంటి స్రావాలు నేరుగా మరొక్క పశువు మీద పడటం ద్వారా ఈ వ్యాధి మరొక పశువుకు సోకుతుంది.
(2) అధికంగా దుమ్ము, దూళి కంట్లో చేరడం వలన
(3) పోషకాహార లోపం వలన
(4) కొన్ని రకాల వైరస్ వ్యాధుల వలన
(5) శరీర వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన కూడా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు కలుగుతుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- ఈ బ్యాక్టీరియాలు కంటిలోకి చేరి, పెరిగి కంటిపై గడ్డలు గాని లేదా కంటి యొక్క “మూకస్ మెంబ్రెన్ పై పొరలాగా ఏర్పడి కాని పాక్షిక అందత్వమును కలుగజేస్తుంటాయి.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- ఈ బ్యాక్టీరియాలు కంటిలోకి చేరి, పెరిగి కంటిపై గడ్డలు గాని లేదా కంటి యొక్క “మూకస్ మెంబ్రెన్ పై పొరలాగా ఏర్పడి కాని పాక్షిక అందత్వమును కలుగజేస్తుంటాయి.
లక్షణాలు:- బ్యాక్టీ రియాలు బాహ్య వాతావరణం నుండి నేరుగా కంటి పొరను చేరి శోధము వలన వ్యాధి గ్రస్త పశువులలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి.
(1) అస్వస్థత వున్న కంటి నుంచి నీరు అధికంగా కారుతుంటుంది.
(2) కంట్లో ఎండి పోయిన నీటి చారలు వుంటాయి.
(3) కంటి నుండి నీరు చిక్కగా శ్లేష్మ సహితంగా కారుతూ వుంటాయి. కళ్ళు ఉబ్బి వుంటాయి.
(4) క్రమంగా పశువులు వెలుగును తట్టుకోలేక పోయే స్థితికి చేరుకుంటాయి.
(5) ఈ దశలో కనురెప్పలు అతుక్కుపోయి శుక్ల పటలంకు కూడా శోధము కలిగి, అపారదర్శక స్థితికి చేరి కొన్ని సార్లు దీని పైన అల్సర్లు వుండి కంటి చూపు పూర్తిగా కోల్పోతాయి. కంటిలో అధికంగా దుమ్ము, దూళి చేరినట్లైతే కంటిలో చీము కూడా ఒక గడ్డలాగా తయారై యుంటుంది.
వ్యాధి కారక చిహ్నములు:-
(1) కళ్ళు ఎర్రగా వాచి వుంటాయి.
(2) కంటి పై గడ్డలు ఏర్పడి చీము పట్టి వుంటుంది.
(3) కంటిలోని కార్నియా పొరపై తెల్లటి పొరలు ఏర్పడి వుంటాయి.
వ్యాధి నిర్ధారణ:-
(1) వ్యాధి చరిత్ర ఆధారంగా
(2) పైన వివరించిన లక్షణములు ఆధారంగా
(3) పైన వివరించిన వ్యాధి కారక చిహ్నములను బట్టి వ్యాధిని నిర్ధారించవచ్చు.
(4) వ్యాధి సోకిన పశువు యొక్క కంటిలోనికి లైట్ వేసినపుడు కాంతిని తట్టుకోలేక, చూపు ప్రక్కకు త్రిప్పుకుంటుంది.
చికిత్స:-
(1) క్లోరంఫెనికాల్, స్ట్రెప్టోమైసిన్, జెంటామైసిన్, అంపిసిలిన్ లాంటి కంటి ఆయింట్మెంట్లను రోజుకు రెండు సార్లు కంట్లో వూయాలి.
(2) కంటి పొర క్రింద డెక్సామెథజోన్ సూది మందును 2-3 రోజులు ఇచ్చినట్లైతే మంచి ఫలితం యుంటుంది.
(3) ఒక వేళ కంటిలో గడ్డలు ఏర్పడడం, కార్నియా పై పొరలు ఏర్పడి వుంటే వాటిని ఆపరేషన్ చేసి తొలగించాలి.
నివారణ:- ఈ వ్యాధి ముఖ్యంగా ఈగల వలన వ్యాపిస్తుంటుంది, కావున పశువుల కొట్టంలో ఈగల బెడద లేకుండా పశువుల కొట్టంను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వుండటం వలన ఈ వ్యాధిని కొంత వరకు నివారించవచ్చు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.
Also Read: Dairy Cattle: పాడి పశువులను ఎంపిక ఎలా చేసుకోవాలి.!