farming in bisleri bottles: మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుంది. ఆలోచన గొప్పదైతే ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఆలోచనకు పదునుపెట్టి గొప్ప గొప్ప పనులు చేయవచ్చు. అందులో భాగంగానే ఓ వ్యవసాయ యువ రైతు అద్భుతం చేశాడు. పొలం అందుబాటులో లేనప్పుడు బిస్లరీ సీసాలలో వంకాయలు సాగు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వంకాయలు మాత్రమే కాదు మిరపకాయలు కూడా పండించారు. సాంగ్లీ జిల్లాకు చెందిన యువ రైతు ఈ ఘనత సాధించాడు. ఇంటి బయట ఉన్న కొద్దిపాటి స్థలంలో బిస్లరీ బాటిళ్లను తలకిందులుగా వేలాడదీసి వంకాయ మొక్కలు నాటాడు ఈ రైతు.
చేపలను పోషించే ఈ కుటుంబం పనుంబ్రే గ్రామంలో నివసిస్తుంది. సమీపంలో వ్యవసాయం లేదు. కానీ ఈ ఇంటి యువ సభ్యుని పట్టుదల ఏమిటంటే తానుపెంచిన ఆహారాన్నే ఇకపై తీసుకుంటాను అన్న గొప్ప ఆలోచన ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నట్టే ముందుగా ఒక మొక్కను నాటడం ద్వారా ప్రయోగాలు ప్రారంభించాడు. మొక్కలు ఏపుగా పెరగడం చూసి ఇతర బిస్లరీ బాటిళ్లలో కూడా మొక్కలు నాటడం ప్రారంభించాడు.
ఇలాంటి మొక్కలు వారి ఇంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కల్లో వంకాయలు వచ్చాయి.ఇప్పటివరకు 5 కిలోల వంకాయలు పండించినట్లు చెబుతున్నాడు ఆ రైతు. మొదటి వంకాయ మొలకెత్తినప్పుడు మేము నమ్మలేకపోయామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ మొక్కలు పెరగడం కాయలు ఇదంతా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ మొక్కలు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఈ మొక్కలను చూసేందుకు వస్తుంటారు. ఫాల్కే కుటుంబం నుండి ఈ మొక్కల గురించి వివిధ రకాల ప్రశ్నలు అడుగుతారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో ఇలాంటి యానిక్ ఫార్మింగ్ జోరు పెరిగింది. భవిష్యత్తులో అనేక కూరగాయలు మరియు ఇతర పంటలు ఈ పద్దతి ద్వారా పెంచే వీలుంది అని నిపుణులు కూడా భావిస్తున్నారు.