ఆంధ్రప్రదేశ్ఈ నెల పంటచీడపీడల యాజమాన్యంతెలంగాణరైతులువార్తలు

Rainfed Crops: వర్షాధార పంటల్లో సమస్యలకు పరిష్కారాలివిగో !

0

Rainfed Crops: వర్షాధార పంటలు సాగుచేస్తున్న రైతులు ప్రస్తుతం ఆ పంటల్లో తలెత్తే సమస్యలు, వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా.జి.నారాయణ స్వామి ఇలా తెలియజేస్తున్నారు.

ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అనంతపురం,కర్నూల్ వంటి జిల్లాల్లో వర్షాధారంగా సాగుచేసిన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి వంటి పంటలు బెట్టకు గురవుతున్నాయి. కావున కొంత వరకు బెట్టను అధిగమించడానికి రైతులు పొటాషియం నైట్రేట్ (13-0-45 ) 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి. నీటి వసతి గల రైతులు పంట కీలక దశలో ఒక రక్షక తడి (ఎర్ర నేలల్లో 20 మి.మీ., నల్ల రేగడి నేలల్లో 40 మి.మీ) ఇవ్వాలి. వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు పంట వ్యర్థాలతో అచ్చాదన చేసుకోవాలి. అలాగే పంటలో కలుపు మొక్కలు లేకుండా చూడటం వల్ల మొక్కకు నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

వివిధ పంటల్లో:

వేరుశనగ: పూత దశ నుంచి కాయ అబివృద్ది దశలో ఉన్న వేరుశనగలో కాండం కుళ్ళు తెగులు ఆశిస్తోంది. దీని నివారణకు హెక్సాకోనజోల్ 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కలు బాగా తడిచేల పిచికారి చేయాలి.

కంది: ప్రస్థుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో వెర్రి తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. రైతులు వెర్రి తెగులు సోకిన మొక్కల్ని గమనించిన వెంటనే తీసి వేయాలి. పంట 60, 90 రోజుల కాలంలో నీటిలో కరిగే గంధకo 3 గ్రా. లేదా ప్రోపర్ గైట్ (ఓమైట్) 2 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న: ప్రస్తుతం మొక్కజొన్న పంట శాఖీయ దశ నుంచి గింజ అబివృద్ది దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు, ఆకుమాడు తెలుగు వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. వీటి నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. మరియు కార్బెండాజిం+మాoకోజెబ్ 2 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆముదం: ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఆముదం పంటలో నామాల పురుగు, బూజు తెగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా.+ కార్బెండాజిమ్ 1 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పత్తి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పిల్చు పురుగుల ఉధృతికి అనుకూలంగా ఉన్నాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులను అదుపు చేయటానికి వేప నూనె 5 మి.లీ లేదా 5 శాతం వేప గింజల కషాయాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పొలంలో పసుపు రంగు జిగట అట్టలు (10 ఎకరానికి), త్రిప్స్ ఉధృతిని గమనించడానికి ఎకరాకు 10 బ్లూ స్టికీ ట్రాప్‌లను ఏర్పాటు చేయాలి. ఉధృతిని బట్టి అసిఫెట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ లేదా అసిటామప్రిడ్ 0.2 గ్రా./లీటర్ నీటికి చొప్పున కలిపి వాతావరణ పరిస్థితులు గమనించి పిచికారి చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకి 10 లింగాకర్షక బుట్టలు అమర్చుకొని, పురుగు ఉధృతిని బట్టి క్వినాల్ ఫాస్ 2 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Cotton in Lauderdale County, Tennessee

కూరగాయ పంటలు: రైతులు కూరగాయల పంటలకు సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. అలాగే వెజిటబుల్ స్పెషల్ ఎరువును 2-3 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పైపాటుగా పిచికారి చేయాలి.
అరటి: తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి.

చీని, నిమ్మ: అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని చీని తోటల్లో కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి.
చీని, నిమ్మలో కొత్తగా చిగురు వచ్చిన తోటలకు సుక్ష్మధాతు లోప నివారణకు ఫార్ములా- 4 లేదా సుక్ష్మధాతువుల మిశ్రమాన్ని లీటరు నీటికి 2.5 నుంచి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

ALSO READ: Kharif Crops: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల్నిఏయే చీడపీడలు ఆశిస్తున్నాయి ? తీసుకోవాలిసిన జాగ్రత్తలు?

మామిడి: మామిడి తోటల్లో కొత్తగా చిగురు వచ్చే సమయంలో సుక్ష్మధాతు లోప నివారణకు ఫార్ములా- 4 లేదా సుక్ష్మధాతువుల మిశ్రమం లేదా మంగో స్పెషల్ లీటరు నీటికి 2.5 నుంచి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

మిరప: ప్రస్తుతo మిరప పంట అక్కడక్కడ శాఖీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తామర పురుగులు, పచ్చ పురుగు ఆశించే వీలుంటుంది. తామర పురుగుల నివారణకు నీలం, పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 30-40 వరకు పెట్టుకోవాలి. అలాగే 10000 పి.పి.ఎం.వేప నూనెను ఒక మి.లీ లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. /లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చపురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గేదేల్లో గొంతు వాపు వ్యాధి వచ్చే అవకాశమున్నందున నివారణకు టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకల్లో ముచ్చు రోగం నివారణకు టీకాలు వేయించాలి.

Leave Your Comments

Groundnut: ఎత్తుమడుల పద్దతిలో వేరుశెనగ సాగుచేస్తే అధిక దిగుబడి !

Previous article

RED GRAM: కంది పంట పూత దశలో… ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

Next article

You may also like