ఈ నెల పంట

ప్రకృతి విధానంలో బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగు..

0

ఆహారమే తొలి ఔషధం అంటారు పూర్వికులు. తమకు అవసరమైన పోషకాలు ప్రత్యేక వంగడాలలో సంప్రదాయ పద్ధతిలో భద్రపరిచి తరతరాలుగా సంరక్షిస్తున్నారు. ఔషధ విలువలలో విశిష్టమైన ఔషధ విలువలతో కూడిన దేశీయ వరి వంగడాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి సాగు మళ్ళీ విస్తృతం అవుతుంది. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు కనుమరుగు అవుతున్న దేశీయ వరి రకాలను ప్రకృతి విధంలో సాగు చేస్తున్నారు.
బియ్యం మన దేశంలోనే కాక చైనా, బంగ్లాదేశ్, వియాత్నం, బర్మా వంటి ఎన్నో ఆసియా దేశాల్లో కోట్లాది మంది ప్రజలకు ప్రధాన ఆధారం. ఈ కోవలోనే అనేక రకాలున్న భారతీయులు ప్రధానంగా తెల్లటి సన్న బియ్యానికే ప్రాధాన్యత ఇస్తారు. దీంట్లో ఎన్నో విలువైన పోషకాలు ఆరోగ్యాన్నిచ్చే నల్ల బియ్యం నిరాదరణకు గురయ్యింది. మార్కెట్లో కేజీ రూ. 300 వుంది. నల్ల బియ్యం పండిస్తే రైతులకు సిరుల పంటే. ఇంతటి ఔషధ విలువలున్న నల్ల బియ్యం సాగుకు వేదికగా మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నాగ సముద్రం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అనే యువరైతు తనకున్న 9 ఎకరాల వ్యవసాయ భూమిలో సుభాష్ పాకేర్ స్పూర్తితో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న దేశీయ రకాలను ఎంచుకొని వరిలో అధిక పోషక విలువలు కలిగిన నవారా, కాలాబట్టి వరి రకాలను 2 ఎకరాల్లో చేస్తూ ఉండగా మరో 7 ఎకరాలలో చిరుధాన్యాలు, ఆయిల్ పంటలు, మినుము, పెసర, మొక్కజొన్న లాంటి పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలను మొత్తం ప్రకృతి విధానంలో తయారు చేసుకున్న కాషాయాలను, ఎరువులనే వాడి సాగు చేస్తున్నారు.
నవారా ఎర్ర రకం బియ్యం ఇవి తినడం వలన షుగర్ ఉన్నవారు చాలా మంచిది. డయాబెటిస్, మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత గలవారు నవారా బియ్యం తింటే తగ్గిపోతాయి.
కాలాబట్టి నల్ల రకం బియ్యం ఇవి తినడం వలన క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గటం, డయాబెటిస్ వంటి వ్యాధులను నయం చేస్తాయి.
పవన్ కళ్యాణ్ తన పొలంలో చీడపీడలను నివారించడానికి నీమాస్త్రం, ఘనజీవామృతం, జీవామృతం తానే తయారు చేసుకొని తన పొలంలో చల్లడం వల్ల ఎటువంటి చీడపీడలు రావు. ఈ మిశ్రమాలను పొలం తయారీ సమయంలోనే అంటే దుక్కి దున్నుకునే సమయంలోనే ఘనజీవామృతం, జీవామృతంను చల్లుతాడు. పవన్ తన పొలంలో ప్రకృతి వ్యవసాయం చేసి దేశీయ వరి వంగడాలను పండిస్తూ అధిక లాభాలను పండిస్తున్నాడు.

Leave Your Comments

వంట నూనెల్లో ఏది మంచి నూనె..

Previous article

మామిడి మాగవేసే పద్ధతులు..

Next article

You may also like