ఈ నెల పంట

శనగలో కలుపు యాజమాన్యం

0
Bengal Gram Cultivation

అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు శనగ విత్తుకోవడానికి అనువైన సమయం. కోస్తా ప్రాంతాల్లో నవంబరు చివరి వరకు కూడా దిగుబడుల్లో పెద్ద వ్యత్యాసం లేకుండా శనగపైరు విత్తుకోవచ్చు. నవంబరు రెండవ పక్షంలో తుఫాన్లు వచ్చే సమాచారం ఉన్న సంవత్సరాల్లో తుఫాను ప్రభావం పైరు పైన పడకుండా ఉండేందుకుగాను, నవంబరు చివరి వరకు శనగ విత్తటాన్ని రైతు పొడిగించుకుంటారు.

శనగ పైరులో కూడా అపరాల్లోవలే కలుపు ఆశించినప్పుడు పెరుగుదల మరియు దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి శనగలో కూడా కలుపు యాజమాన్యం ముఖ్యం. ఈ కింద తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించి శనగలో కలుపు సమస్యను అధిగమించవచ్చు.

యాంత్రిక పద్ధతులు :

  • శనగ విత్తే ముందు 2-4 సార్లు అవసరాన్ని బట్టి దుక్కి చేయాలి. ఇలా దుక్కిచేయడం ద్వారా పొలంలో ఉన్న అన్ని రకాలైన కలుపు మొక్కలు పూర్తిగా నశిస్తాయి. అలాగే నేల పైపొరల్లో ఉండి మొలకెత్తే శక్తి గల కలుపు విత్తనాల చాలా వరకు మొక దశలోనే నివారించబడతాయి. ఇలా దుక్కి 2-4 సార్లు దున్ని శనగ విత్తినప్పుడు పైరుతో పాటుగా మొలిచే కలుపు మొక్కను చాలా వరకు నివారించవచ్చు.
  •  శనగపైరు 15-20 మరియు ౩౦-35 రోజుల దశలో సదుపాయాలు ఉన్నప్పుడు అంతర సేద్యం చేసి సాళ్ళ మధ్య పెరిగే కలుపును నివారించవచ్చు. అంతర సేద్యం తరువాత పొలంలో మిగిలిన కలుపు మొక్కలను కూలీలతో తీయించి కలుపును చాలా సమర్థవంతంగా నివారించవచ్చు.
  • కూలీలు తగినంత మంది అందుబాటులో ఉన్నప్పుడు పైరు విత్తిన 15-20 రోజుకు మొదటిసారి, ౩౦-35 రోజుకు రెండవసారి కలుపు మొక్కను తీసివేసి శనగకు కలుపు వల్ల నష్టం లేకుండా చేయవచ్చు.

కలుపు మందు వినియోగం :

  •  అంతర సేద్యం చేయడానికి, కూలీలతో తీయించడానికి సదుపాయాలు లేని పరిస్థితుల్లో కలుపు మందు ద్వారా శనగలో కలుపు నివారించవచ్చు.
  • శనగ విత్తిన వెంటనే ఎకరానికి 1.0 నుండి 1.25 లీ. పెండిమిథాలిన్‌ 30 శాతం (స్టాంపు, పెండిస్టార్‌ వంటివి) 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రేచేసి పంటతో పాటు మొలిచే కలుపు మొక్కలను చాలా వరకు నివారించవచ్చు.
  • శనగపైరు పెరిగే దశలో (20`25 రోజు) కలుపు మొక్కలు 2`3 ఆకు దశలో ఉన్నప్పుడు ఎకరానికి ఫెనాక్సాఫాప్‌ 9 శాతం (విప్‌సూపర్‌) 250 మి.లీ. (లేక) క్విజలోఫాప్‌ ఇథైల్‌ 5 శాతం (టర్గాసూపర్‌) 400 మి.లీ. (లేక) ప్రొపాక్విజాఫాప్‌ 10 శాతం (ఎజిల్‌, సొసైటి) 250 మి.లీ. స్ప్రే చేసి గడ్డి జాతికి చెందిన కలుపు నివారించవచ్చు.
  • శనగ పైరు పెరిగేదశలో వెడల్పాకు కలుపును నివారించడానికి ఉపయోగపడే కలుపు మందు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
Leave Your Comments

ఏరువాకకు స్ఫూర్తి,నేటి తరానికి మార్గ దర్శి, రైతు నేత రంగయ్య తాత, రైతుసాథికారతకు ప్రతీక…

Previous article

వంగ పంటను ఆశించే పురుగులు-నివారణ పద్ధతులు

Next article

You may also like