YSRCP MLA Bolla Brahmanaidu తన నోటిదురుసుతో ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గౌరవం అనే పదానికి ఆమడ దూరంలో ఉండే నేతగా గుంటూరు జిల్లాలో పేరొందిన వినుకొండ ఎమ్మెల్యే మరోసారి రచ్చ చేశారు. గతంలో ఎలాంటి వివాదాలు మూటగట్టుకున్నప్పటికీ ఈ సారి రైతన్నపై తన ప్రతాపం చూపించాడు. గిట్టుబాటు ధర అడిగిన ఓ రైతన్నని చెప్పుతో కొట్టేందుకు యత్నించాడు. వివరాలలోకి వెళితే…
వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో వైసీపీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోయారు. దీంతో ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు, రైతు గడిపూడి నరేంద్ర ఎంపీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. రైతు భరోసా కేంద్రాల్లో రూ.1,450 ధర కల్పించినా కొనడం లేదని ఎంపీకి ఫిర్యాదు చేశాడు ఆ రైతు. అయితే రైతు సమస్యను అర్ధం చేసుకున్న ఎంపీ వెంటనే ఫోన్లో జాయింట్ కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారుల్ని సంఘటన స్థలానికి పంపించారు. ఈ నేపథ్యంలో సదరు రైతుతో మాట్లాడి రెండు రోజుల్లో ఆర్ బీకే ద్వారా ఆ గ్రామంలో వరిని కొనుగోలు చేస్తామని చెప్పారు.
కానీ రైతు నరేంద్ర ఆర్ బీకేల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి డబ్బులు ఇస్తామని భరోసా ఎవరు ఇస్తారని.. ఎంపీని ప్రశ్నించారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా MLA Bolla ఒక్క ఉదుటన లేచి ఏంట్రా.. నా.. కొడకా.. నీకు భరోసా ఇచ్చేది అంటూ తన కాలి చెప్పులు తీసుకుని నరేంద్రను కొట్టేందుకు దూసుకెళ్లారు. ఇక దురుసు ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే పై రైతు నరేంద్ర కూడా ఎదురు తిరిగాడు.మేమూ కొట్టగలం అనడంతో ఎమ్మెల్యే పోలీసులను పిలిపించి రైతును లాకప్లో వేయించారు. విశేషం ఏంటంటే.. ఈ ఘటన గురువారం సాయంత్రం జరగగా శుక్రవారం రాత్రి వరకు కూడా రైతును పోలీసులు విడిచి పెట్టలేదు.
Agriculture News, Eruvaaka Daily News