ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Weed Control In Maize Crops: మొక్కజొన్న, అపరాల పంటల్లో కలుపు నివారణ

0
Weed Control In Maize Crops
Maize Crop

Weed Control In Maize Crops: మొక్కజొన్న పంట విత్తిన 15-20 రోజులకు గడ్డి జాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే వాటి నివారణకు టోప్రమిజోన్ 33.6% SC 30 మి.లీ./ఎకరం + అట్రాజిన్ 50% WP 400 గ్రా./ఎకరం లేదాటెంబోట్రియాన్ 34.4% SC 115 మి.లీ./ఎకరం+ అట్రాజిన్ 50% WP 400 గ్రా./ఎకరానికి లేదా అట్రాజిన్ + మెసొట్రియోన్ 24.97 % SC 1400 మి. లీ./ఎకరానికి పంట విత్తిన 15-20 రోజులకు పిచికారి చేయాలి.

  • మొక్కజొన్న విత్తిన 20-25 రోజులకు వెడల్పాటి కలుపు ఉన్నప్పుడు 2,4-డి సోడియం సాల్ట్ 80 % WP 500 గ్రా./ఎకరానికి పిచికారి చేయాలి.
  • తుంగ జాతి కలుపు నివారణకు హలోసల్ఫ్యూరాన్-మిథైల్ 75%WG 36 గ్రా./ఎకరానికి విత్తిన 20-25 రోజులకు పిచికారి చేయాలి.
  •  జీరో-టిల్లేజి మొక్కజొన్నలో అట్రాజిన్ 50 % WP 1000 గ్రా./ఎకరానికి + పారాక్వాట్ 24% 1000 మి.లీ./ఎకరానికి విత్తిన వెంటనే పిచికారి చేయాలి.
Weed Control In Maize Crops

Maize Crop

అపరాలు (మినుములు/పెసలు):

Weed Control In Maize Crops

Black Gram

విత్తిన వెంటనేపెండిమెథాలిన్ + ఇమాజితాపైర్ 32 % 1000 మి.లీ./ఎకరం (రెడీ మిక్స్) లేదాపెండిమిథాలిన్ 38.7% CS 700 మి.లీ./ఎకరం లేదా పెండిమెథాలిన్ 30% EC 1000 మి.లీ./ఎకరానికి పంట విత్తిన వెంటనే లేదా విత్తిన 2 రోజుల లోపల పిచికారి చేయాలి.

  •  విత్తిన 20-30 రోజులకు గడ్డి జాతి, వెడల్పాకు కలుపు నివారణకు
    ఇమాజితాపైర్ 10% SL 200 మి.లీ./ఎకరానికి లేదా ఫోమేసఫెన్ 11.1% + ఫ్లుజయాఫోప్ పి-బుటైల్ 22.2% EC 400 మి.లీ./ఎకరానికి లేదా ఎసిఫ్లోర్ఫెన్ 16.5% + క్లోడినాఫాప్ ప్రొపార్గిల్ 8% 24.5 EC 300 మి.లీ./ఎకరానికి పిచికారి చేయాలి.
  •  గడ్డి జాతి కలుపు నివారణకు ప్రోపాక్విజాఫాప్-పి-ఇథైల్ 10 % EC 250 మి.లీ./ఎకరం లేదా క్విజాలోఫాప్-పి-ఇథైల్ 5% EC 400 మి.లీ./ఎకరానికి పిచికారి చేయాలి.

కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు:

  • కలుపు మందులను ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు లేతగా అంటే 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు కలుపు మొక్కలపై పడే విధంగా పిచికారీ చేయాలి.
  •  పంటలో వచ్చే కలుపు జాతిని బట్టి సరైన కలుపు మందును సరైన మోతాదులో మాత్రమే కలుపు లేత దశలో ఉన్నప్పుడు మాత్రమే చల్లుకోవాలి.
  • కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు చేతి పంపును మాత్రమే ఉపయోగించాలి. గాలి వాటం ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయకూడదు.

డా. మానుకొండ శ్రీనివాస్, డా.టి. శ్రీనివాస్
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, మారుటేరు

Leave Your Comments

Farmer Narayanappa: 30 సెంట్లలో 20 రకాల కూరగాయలు… 2 లక్షల దాకా ఆదాయం !

Previous article

Telangana Weather Report: ఆగష్టు 23 నుంచి 28 వరకు… తెలంగాణాలోవాతావరణం ఎలా ఉండబోతుంది ? రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Next article

You may also like