UP CM slashes power tariff రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్న నానుడి ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. ఈ మేరకు రైతులకు ప్రభుత్వాలు అన్ని విధాలా సహకారాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా యూపీ గవర్నమెంట్ రైతులకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ వినియోగం కోసం విద్యుత్ ఛార్జీలలో 50% తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యతో పాక్షిక గ్రామీణ ప్రాంతాల్లోని 13 లక్షల మంది వినియోగదారులు తక్షణమే ప్రయోజనం పొందుతారు.
ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని పంపుల కోసం మీటర్ కనెక్షన్‌ల కోసం రైతులు యూనిట్‌కు ప్రస్తుతం రూ. 2 చెల్లించకుండా యూనిట్‌కు రూ.1 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. హార్స్‌పవర్‌కు (హెచ్‌పి) 70 రూపాయల స్థిర ధర కూడా హెచ్‌పికి 35 రూపాయలకు తగ్గించబడింది. అదేవిధంగా, అన్‌మీటర్డ్ కనెక్షన్‌కు స్థిర రేటు హెచ్‌పికి రూ.170 నుండి హెచ్‌పికి రూ.85కి తగ్గించబడింది. ఇంధన పొదుపుగా ఉండే పంపుల విద్యుత్ ఖర్చు యూనిట్‌కు రూ.1.6 నుంచి 83 పైసలకు తగ్గింది. గతంలో హెచ్‌పీకి రూ.70గా ఉన్న స్థిర ధర రూ.35కి తగ్గింది.
మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మీటర్ విద్యుత్ పొందుతున్న రైతులకు యూనిట్‌కు రూ.6 నుంచి రూ.3కి తగ్గించారు. హెచ్‌పీకి స్థిర ధర కూడా రూ.130 నుంచి రూ.65కి తగ్గింది.రైతుల సౌలభ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ అధికారి సమాచారం ప్రకారం ఇది తక్షణమే అమలులోకి వస్తుంది.
Agriculture News Live, Farming Tips, Eruvaaka Daily Updates