TS Kisan Call Centre: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.దీనికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ తదితరులు హాజరయ్యారు.
Also Read: Environmental Performance Index (EPI): ఎన్విరాన్‌మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారత్ స్తానం 180
వ్యవసాయ శాఖ సేవల పరిశీలనకు కాల్ సెంటర్
రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు నేరుగా రైతుల నుండి తెలుసుకునే ప్రయత్నం దిశగా అడుగులు వేస్తుంది. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతుల ఫోన్ నంబర్లు ఉన్నాయని, వీరి నుండే వివరాలు నేరుగా సేకరించవచ్చని ఆలోచిస్తున్నారు. రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. మంత్రి సింగిరెడ్డి ” రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతాం ” అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో రైతుభీమా అందిన వివరాలను కాల్ సెంటర్ నుండి మాట్లాడి తెలుసుకునారు మంత్రి నిరంజన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రైతుభీమా ద్వారా అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు భీమా సొమ్ము రైతు కుటుంబానికి భరోసానిస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.
త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తామన్నారు. దీనితో పాటుగా యధావిధిగా రైతుబంధు నిధులు విడుదల చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Agriculture in British Era: బ్రిటిష్ వ్యవస్థలో వ్యవసాయం ఇలా ఉండేది.!