Woman Farmer: ఈ మధ్య కాలంలో వ్యవసాయంలో మహిళల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. మహిళలు సులువుగా వ్యవసాయంలో వాడే యంత్రాలు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో, రాగిమానుపెంట గ్రామంలో తలిపినేని లీల గారు గత 45 సంవత్సరాల నుంచి మామిడి తోట సాగు చేస్తున్నారు. కేవలం పండ్ల కోత సమయంలో మాత్రమే పని వాళ్ళని పెట్టుకుంటుంది. మిగిలిన సమయంలో లీల గారు తోట పని మొత్తం తనే స్వయంగా చేసుకుంటున్నారు.
లీల గారు మామిడి తోటలో చాలా రకాల మామిడి పండ్లని పండిస్తున్నారు. నీలం, అల్ఫోన్సా, తోతాపురి, బెనిస ఇలా చాలా రకాల పండ్లని పండిస్తున్నారు. ఈ తోట నుంచి ప్రతి సంవత్సరం 120-160 టన్నుల వరకు దిగుబడి తీసుకుంటున్నారు. కానీ గత సంవత్సరం అకాల వర్షాలు, గాలుల వల్ల చాలా వరకు పంట దిగుబడి తగ్గింది. పంట పూత కూడా రాలిపోవడం జరిగింది . పూత వచ్చిన కాయల నాణ్యత తగ్గింది.
Also Read: Floriculture: ఈ సాగులో పెట్టుబడి తగ్గి, రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి..
అందువల్ల ఈ సంవత్సరం 25 ఎకరాల నుంచి కేవలం 30 నుంచి 35 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా చాల వరకు నష్టాలే ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి నుంచి కేవలం 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే లాభాలు పొందారు. 70 శాతం వరకు నష్టాలే పొందారు. పురుగుల నుంచి కాయలు నాణ్యత కొలిపోకుండా ఉండడానికి పురుగుల మందులు పిచికారీ చేసిన ఎలాంటి లాభాలు లేవు. తక్కువ దిగుబడి వచ్చిన కూడా మార్కెట్లో మంచి ధర ఉండడంతో ఎక్కువ నష్టాలలో ఉండలేదు.
Also Read: Plant Nutrition: మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే పోషక పదార్థాలు ఎన్ని ఉన్నాయి?