Barahi Dates: రైతులు సాధారణమైన పంటలు లాభాలు తక్కువ రావడంతో పొలంలో కొంత భాగం తోటలు పెడుతున్నారు. ఈ తోటలో మన ప్రాంతాల్లో ఎక్కువ ధరకు ఉన్న పండ్లు ఖర్జూర. ఖర్జూరలో దాదాపు 60 రకాలు వెరైటీలు ఉన్నాయి. ఖర్జూర తోటలతో రైతులకి మంచి దిగుబడితో పాటు లాభాలు కూడా వస్తున్నాయి. నంద్యాల జిల్లా, జంబులదిన్నె గ్రామంలో శేఖర్ రెడ్డి అనే రైతు ఒక కొత్త రకం ఖర్జూర పండ్లు సాగు చేస్తున్నారు.
ఈ ఖర్జూర పండ్లలో బర్రహి రకం రైతు శేఖర్ రెడ్డి గారు సాగు చేస్తున్నారు. ఈ చెట్లని తమిళనాడు జిల్లా నుంచి తెచ్చుకొని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అయిదు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖర్జూర మొక్కలని 24 ఫీట్ల దూరంలో నాటుకున్నారు. ఈ మొక్కలని టిష్యూ కల్చర్ ద్వారా సాగు చేసి తర్వాత భూమిలో నాటుకోవాలి.
అయిదు ఎకరాలో 485 చెట్లను పెంచుతున్నారు. ఈ పంటని సాగు చేయాలి అనుకున్న రైతులు వారి పొలం చుట్టూ కంచె వేసుకోవాలి. ఈ పంటకి కుందేళ్ళు దాడి ఎక్కువగా ఉంటుంది, వాటి నుంచి పంటని రక్షించడానికి పొలం చుట్టూ కంచె తప్పనిసరిగా వేసుకోవాలి. బర్రహి రకం చెట్లని నాటిన నాలుగు సంవత్సరాలకి పంట దిగుబడి మొదలు అవుతుంది. ఈ పంట సంవత్సరం పూర్తిగా వస్తుంది.
Also Read: Colocasia Cultivation: చామ దుంప సాగు వివరాలు.!
శేఖర్ రెడ్డి రైతు ఈ పంటని సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నారు. కానీ ఈ చెట్లకి ఆవు పేడ ఎరువుగా వాడకూడదు. గోర్లు, మేకల ఎరువు మాత్రమే పంటికి ఎరువుగా వేయాలి. గోర్లు, మేకల ఎరువులో వేడి ఎక్కువగా ఉండటం ద్వారా చెట్లకి మంచి బలం ఇస్తుంది. ఈ పంటకి కీటకాల దాడి ఎక్కువ ఉంటుంది దానికి ప్రతి నెల పురుగుల మందులు పిచికారీ చేయాలి. మందుల పిచికారీ చెట్టుకి మాత్రమే చేయాలి కొమ్మలకి కాదు.
ఈ బర్రహి ఖర్జూర ఒక మొక్క ఖరీదు 4500 రూపాయలు. అయిదు ఎకరాలకు మొత్తం పెట్టుబడి 25 లక్షల వరకు వస్తుంది. ప్రస్తుతం ఒక చెట్టుకి 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. చెట్లు ఇంకా పెరితే దాదాపు ఒక చెట్టుకి 100 కిలోల వరకు దిగుబడి రావచ్చు. బర్రహి ఖర్జూర ఆకుపచ్చ రంగు నుంచి నారింజ రంగుకు మారితే వీటిని తినవచ్చు. వీటిని డ్రై చేసి అమ్ముకోవడానికి కూడా యంత్రాలు ఉన్న వాటికి ఎక్కువ ఖర్చు కారణంగా ప్రస్తుతం పొలం దగ్గరే వ్యాపారులకు అమ్ముతున్నారు.
రైతులు ఈ పండని ఒక కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు. కానీ వ్యాపారులు కిలో 200-250 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ పండ్లని మార్కెటింగ్ చేసి అమ్ముకునే రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పండ్ల ఒక క్వింటాల్ ధర లక్ష రూపాయలుగా మార్కెట్లో అమ్ముతున్నారు. పెట్టుబడి ఎక్కువగా ఉన్న ఈ పండ్లకి డిమాండ్, ధర ఎక్కువ ఉండటంతో రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. ఈ బర్రహి ఖర్జూర రకం సాగు గురించి ఇంకా సమాచారం కోసం లేదా కొనుగోలు చేయడానికి 7013236325 నెంబర్ సంప్రదించండి.
Also Read: Potato Processing: బంగాళదుంప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు భారీ లాభాలు.!