PM Kisan FPO Yojana: కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఎన్నో రకాల పథకాలను అందజేస్తుంది. ఈ పథకాల వల్ల అన్నదాతలకు ఎంతో సహాకారం అందుతుందని చెప్పవచ్చు. రైతుల పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతన్నలు ఏటా 3 విడతల చొప్పున 6 వేలు పొందుతున్నారు. కేంద్రం ఈ నగదును రైతుల పెట్టుబడి సహాయార్థం నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేస్తుంది. ఇలా కేవలం ఈ ఒక్క పథకమే కాకుండా ఇంకా ఎన్నో రకాల పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, అందులో ఒకటే ఈ ఎఫ్ పి ఓ (FPO) పథకం. కేంద్రం అందిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒక అద్భుతమైన పథకంగా చెప్పుకోవచ్చు.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, దేశంలోని రైతులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సహాయం అందించడమే. ఈ పథకం కింద కేంద్రం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే రైతులకు 15 లక్షల రూపాయలను అందిస్తుంది. ఇందుకోసం రైతులు ఒక సంస్థను లేదా ఒక కంపెనీని (FPO) ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంస్థలో కనీసం 11 మంది రైతులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీంలో రైతులు మందులు, ఎరువులు మరియు విత్తనాల వంటి వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. పది వేల ఎఫ్ పి ఓ (FPO) లే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2023-2024 వరకు కేవలం 2389 ఎఫ్ పి ఓలు మాత్రమే నమోదు అయ్యాయి.

PM Kisan FPO Yojana Scheme
ఈ పథకం కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:
మొదట నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ https://www.enam.gov.in/ అనే పోర్టల్ ని ఓపెన్ చేసుకోవాలి.
తరువాత హోమ్ పేజీలోని FPO లింక్ మీద నొక్కాలి.
అక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు వివరాలను నింపాలి.
ఈ పథకం కొరకు e -NAM మొబైల్ యాప్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, ఐ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఫోటోలు మరియు బ్యాంకు స్టేట్ మెంట్.
Also Read: PM Kisan Scheme: PM కిసాన్ పథకానికి మీరు అర్హులేనా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి..!
PM Kisan Mandhan Yojana: వృద్ధ రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయల పెన్షన్ పథకం