Agriculture Department Advices: ఆకాశానికి చిల్లు పడినట్టు గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి, దీంతో నదులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువలకు పూర్తిగా నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చెరువులు, ఊళ్లు ఏకమైపోయాయి. అంతలా వరుణుడు రాష్ట్రంపై ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే నదులు, చెరువులు పొంగి ప్రవహిస్తుంటే.. ఈ ప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. వరి, ఆరుతడి పంటలు వేసిన రైతులు పరిస్ధితి మరి అద్వానంగా తయారు అయ్యింది. మొన్నటి వరకు వర్షాలు కోసం ఎదురుచూసిన అన్నదాతలు ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయి తమ పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
స్వల్పకాలిక వరి విత్తనాలతో మేలు: వర్షాల నేపథ్యంలో పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కొన్ని కీలక సూచనలు చేశారు. వానల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. పంటలను ఎలా రక్షించుకోవాలనే దానిపై సలహాలు ఇస్తున్నారు. పొలాల్లోకి వచ్చిన నీటిని కాలువల ద్వారా బయటికి తీసి వేయాలని సూచించారు. 25 రోజులు దాటిన పంటలకు ఎలాంటి ఎరువులను వేయాలని, వేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. ఈవర్షాలు వరి సాగుకు అనుకూలంగా మారాయాని ఇది వరకే నారు పోసుకున్న వారు నాట్లు పూర్తి చేసుకోవాలని కోరారు. నార్లు ఇంకా మొదలు పెట్టని వారు స్వల్పకాలిక విత్తనాలను వెదజల్లు కోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతులు ముదిరిన నారుతో నాట్లు వేయొద్దని వేస్తే దిగుబడులు రావని సూచించారు.
Also Read: Collective Natural Farming: సామూహికంగా ప్రకృతి వ్యవసాయం.!
పత్తిలో నీటి నిల్వ ఉండొద్దు: అలాగే మొట్ట పంటలు అయినా పత్తిలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షానికి మొక్కలు పడిపోకుండా చుట్టూ మట్టి వేయాలని రైతులకు సూచించారు. వర్షం పూర్తిగా తగ్గిన తరువాత ఒక ఎకరానికి పైరిథయోబాక్ సోడియం+ క్విజలాఫాప్ ఈథైల్ 500 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేయాలని కోరారు. మరియు మొక్కజొన్న పంటకు కూడా పలు సూచనలు చేశారు. సోట్రయాన్+అట్రాజిన్ 1400 మి.లీ. లేదా టెంబోట్రయాన్+అట్రాజిన్ 115 మి.లీ.+500గ్రా. పిచికారి చేయాలని అన్నారు. కంది/పెసర/మినుము ఎకరానికి ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ల చొప్పున స్ప్రే చేయాలని వ్యవసాయ వర్సిటీ సూచనలు చేశారు.
Also Read: Backyard Vegetable Farming:పెరటితోటల్లో కూరగాయల పెంపకం.!