రైతులు

రైతులకి గుడ్ న్యూస్…రేపే ఖాతాల్లోకి నగదు

0
Telangana Farmers

Rythu Bandhu

Telangana Farmers Will Get Rythu Bandhu From Tomorrow పెట్టుబడికోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి వ్యవసాయం చేసిన రైతన్నలు ఆ వడ్డీ కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకంతో లక్షలాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులకు పెట్టుబడి పరంగా రైతుబంధు వరంగా మారింది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాలతో డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. నగదు బదిలీ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. cm kcr

Rythu Bandhu

Telangana Rythu Bandhu ఈ ఏడాది సుమారు 63.25 లక్షల మంది రైతులను(150.18లక్షల ఎకరాలకు) రైతుబంధు పధకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే అర్హుల జాబితాను సీసీఎల్‌ఏకు అందించినట్లు ఆయన స్పష్టం చేశారు. వీరందరికీ రైతుబంధు సాయాన్ని అందించేందుకు రూ. 7508.78 కోట్లు కేటాయించారు. కాగా.. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు.. రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ యాసంగి సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Rythu Bandhu

Rythu Bandhu Releases From December 15th ఇకపోతే తెలంగాణ వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు కళ్ళలో నీళ్లు వస్తే అది దేశానికే ప్రమాదమని నమ్మిన సీఎం రైతులకు లబ్ది చేకూర్చేందుకు ఇప్పటికే అనేక పథకాలు తీసుకొచ్చారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి పుష్కలమైన నీరు అందించడం కావచ్చు, రైతులు ఇబ్బందులు పడొద్దని నిరంతర ఉచిత కరంటు కావచ్చు, పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతుబంధు ఇలా రైతులకు మేలు చేసే అద్భుతమైన పథకాలతో నేడు తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. Telangana Farmers

Leave Your Comments

రైతులందరికీ ప్రధాని మోడీ ఆహ్వానం

Previous article

మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు

Next article

You may also like