Vannamei Prawn Cultivation: ప్రపంచవ్యాప్తంగా వెన్నామి రొయ్యల సాగు రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రపంచ రొయ్యల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో ఉత్పత్తవుతున్న వెన్నామి రొయ్యలు ముఖ్యంగా అమెరికా సంయుక్తం రాష్ట్రాలు, యూరప్ దేశాలు, వివిధ ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతూ మన దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది.
మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న వెన్నామి రొయ్యల్లో 60 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించినవే. అయితే సరైన యాజమాన్య పద్ధతులు: పాటించని కారణంగా వెన్నామి రొయ్యల పెంపకం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో లాభదాయకమైన దిగుబడిని పొందుటకు శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది..
మేలైన యాజమాన్య పద్ధతులు: వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే ముందు, సాగు జరుగుతున్న సమ యంలోను, సాగు తర్వాత చేపట్టాల్సిన వివిధ అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి.
స్థలం ఎంపిక: నీటిని నిలిపి ఉంచుకునే స్వభావం గల నేలలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంచుకోవాలి. ఉదాహరణకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఒండ్రు ఇసుక నేలలు, ఇసుక నేలలు నీరు ఇంకే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ నేలలు రొయ్యల పెంపకానికి అనుకూలం కాదు. చెరువు నిర్మాణం: హెక్టారు విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో చెరువులను నిర్మించుకోవడం శ్రేయస్కరం చెరువు నిర్మాణానికి ముందే భూసార పరీక్ష చేయించి తర్వాత చెరువు తవ్వకాన్ని ప్రారంభించాలి.
Also Read: Prawn Farming: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు
చెరువు గట్ల నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గట్ల విస్తీర్ణం అధికమైతే పెంపకం విస్తీర్ణం, ఉత్పాదకత క్షీణిస్తుంది. తక్కువైతే నీటి వేగం పెరిగినప్పుడు గట్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చెరువు గట్లను 1:2 నిష్పత్తిలో అవుట్లెట్ వైపుకు ఏటవాలుగా నిర్మించడం జరుగుతుంది. అంటే చెరువు గట్ల ఎత్తు 1మీటరు అయితే, ఏటవాలు 2 మీట ర్లుగా తీసుకోవడం జరుగుతుంది.
సాధారణంగా చెరువులోతు ఒకటిన్నర నుంచి రెండు మీటర్లు ఉండేలా చెరువులను నిర్మించాలి. చెరువు నిర్మిస్తున్న సమయంలోనే ఇన్లెట్, సెంట్రల్ డ్రైన్, అవుట్లెట్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే పెంపకకాలంలో ఏర్పడే సేంద్రియ వ్యర్థ పదార్థాలు తొలగించటం సులభమవుతుంది..
చెరువు తయారీ: చెరువు తయారీకి ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెరువును ఎండకు ఆరబెట్టడం, చెరువు అడుగుభాగం దున్నడం, కలుపు మొక్కల నిర్మూలన, సున్నం వాడకం, సహజసిద్ధమైన ఎరువులు వాడడం మొదలైనవి.
చెరువు నేలను బాగా ఎండకు ఆరనివ్వడం వల్ల పంట సమయంలో హానికర వాయువులైన హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, మీథేన్ల ఉత్పత్తి తగ్గుతుంది.మట్టి పి. హెచ్. విలువ (ఉదజని సూచిక) సరైన క్షారత్వానికి అనుగు ణంగా పొలాలకు వాడే సున్నం చల్లుకోవాలి. చెరువులో తగినంత ప్లాంక్టన్ వృద్ధికి పులియబెట్టిన వేరుసెనగ చెక్క, తవుడు, ఈస్ట్ల మిశ్రమాన్ని చల్లాలి.
రిజర్వాయర్ చెరువు ఏర్పాటు: ఉప్పు నీటి కాలువల ద్వారా పంపింగ్ చేసుకొనే నీటిని ముందుగా శుద్ధి పరిచి తర్వాతనే పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి. ఇందుకోసం రిజర్వాయర్ చెరు వును ఏర్పాటు చేసుకోవాలి. పెంపక చెరు వుల విస్తీర్ణంలో 10 శాతం విస్తీర్ణాన్ని రిజర్వా యర్ చెరువులు ఏర్పాటుకు వినియోగించాలి. ఈ విధానంలో వ్యాధికారక జీవులను, వాహ కాలను నీటి ద్వారా పెంపక చెరువుల్లోకి చేర కుండా నివారించవచ్చు.కాలువల నుంచి రిజర్వాయర్లోకి తోడు కున్న నీటిని క్లోరినేషన్ ద్వారా శుభ్రపరచిన 3-4 రోజుల తర్వాత పెంపక చెరువుల్లోకి తోడుకోవాలి.
Also Read: Fish Farming: చేపపిల్లల (ఫ్రై, ఫింగర్‌లింగ్స్) పెంపకంతో అధిక లాభాలు.!
Also Watch: