Hydroponic Farming: ఆర్గానిక్ వ్యవసాయాన్ని మట్టిలో ఉన్న సహజ పోషకాలతో చేస్తే.. హైడ్రోపోనిక్ విధానంలో మొక్కలకు బయట నుండి పోషకాలు అందిస్తారు. పై చదువులు చదివి, తండ్రి కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, ప్రస్తుతం ఆ వృత్తిని వదిలి హైడ్రోపోనిక్ వ్యవసాయం చేస్తూ నెలకి లక్షన్నర సంపాదిస్తున్నాడు రసిక్ నకుం. మరి హైడ్రోపోనిక్ వ్యవసాయం విధానం గురించి రసిక్ ఏమన్నాడో చూద్దాం…
నా పేరు రాసిక్ నకుం. నేను మెటాడోలో నివసిస్తున్నాను. కాయగూరలు పండించడానికి ప్రధానంగా సూర్యరశ్మి, పోషకాలు, నీరు లాంటి మూడు వనరులు అవసరం. హడ్రోపోనిక్ వ్యవసాయంలో మొక్కలకు కృత్రిమంగా పోషకాలు అందిస్తాము. వాటిని నీటితో కలిపి ఒక ట్యాంక్ లో నిల్వ చేస్తాము. ఇలా చేయడం వలన పోషకాల శాతాన్ని అంచనా వేయడంతో పాటు, వ్యర్థం కాకుండా కాపాడగలం. ఈ పద్దతి ద్వారా మొక్కలకు 100 శాతం పోషకాలు అందుతాయి.
హైడ్రోపోనిక్ వ్యవసాయంలో మొక్కలకు మట్టి వాడకపోవడం వల్ల మట్టిలో ఉండే చెడు బ్యాక్టీరియా కలిగించే రోగాలు కూడా మనుషులపై ప్రభావం చూపవు. ప్రస్తుతం కాయగూరలు పండించడానికి అత్యధికంగా రసాయనాలు వాడుతున్నారు. ఈ ప్రక్రియ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ముంపు నుండి తప్పించుకోవడానికి నేను హైడ్రోపోనిక్ వ్యవసాయాన్ని చేయాలనీ అనుకున్నాను.
డిడిటి అనే రసాయనం చాలా విషపూరితమైంది. ఇది ఆవు పాలను కూడా విషపూరితం చేస్తుంది. అలాంటి పాలు తాగిన పిల్లలు జబ్బు పడుతున్నారు. ఇక రసాయనాలతో పండించిన కాయగూరలు తినడం వల్ల ప్రజలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. హైడ్రోపోనిక్ విధానం ద్వారా ప్రజలు ఇంట్లోనే తాజా కూరగాయాలు పండించుకోవచ్చు. హైడ్రోపోనిక్ వ్యవసాయం ఇజ్రాయెల్, జర్మనీ, చైనా, అమెరికా లాంటి చాలా దేశాల్లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా వ్యవసాయాన్ని గుజరాత్ లో కూడా చేస్తున్నారు.
రసిక్ నకుం కెమిస్ట్రీలో డిగ్రీ సంపాదించడంతో పాటు బీఈడీ కూడా పూర్తి చేశారు. అయన తండ్రి కోరిక మేరకు అయన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు రసిక్ తన టీచర్ జాబ్ ని వదిలేసి వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా ఎంచుకున్నారు. హైడ్రోపోనిక్ వ్యవసాయానికి కావాల్సిన పోషకాల గురించి ఏడేళ్ల పాటు పరిశోధన చేశాను అని రసిక్ చెప్పారు. ఈ తరహా పరిశోధనకు 16 రకాల మూలకాలు అవసరం ఉంటుంది.అయితే వీటిని వాడే నిష్పత్తి ప్రతి మొక్కకు భిన్నంగా ఉంటుంది. హైడ్రోపోనిక్ విధానంలో మొక్కలకు వేర్ల నుండి పోషకాలు లభిస్తాయి అని చెప్తున్నారు రసిక్ నకుం.
Also Read: హైడ్రోపోనిక్స్ విధానంతో ఉద్యాన పంటల సాగు..
సాధారణ రైతులు అందరూ హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేందుకు ముందు రావాలని కోరుతున్నారు రసిక్ నకుం. పంట భూములు క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో తక్కువ భూభాగం నుండి అధిక దిగుబడులు పొందేందుకు రైతులు ఆలోచించాలని రసిక్ కోరుతున్నారు. హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని చేపట్టాలి. అయితే ఈ విధాన వ్యవసాయం మొదలు పెట్టేటప్పుడు భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుందని రసిక్ తెలిపారు. అయితే కాలానుగుణంగా హైడ్రోపోనిక్ వ్యవసాయానికి పెట్టే పెట్టుబడి గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు రసిక్ నకుం.
Also Read: హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..