ఆంధ్రప్రదేశ్చీడపీడల యాజమాన్యంతెలంగాణరైతులువార్తలు

Horticultural crops: ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులకు ప్రత్యేక సలహా !

0
Horticultural crops
Horticultural crops

Horticultural crops:మిరప, కూరగాయల పంటలకు,చేమంతి వంటి పూల మొక్కలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని నత్రజని ఎరువును మోతాదు మేరకు పైపాటుగా వేసుకోవాలి. అరటి సాగు చేసే రైతులు తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి. స్వీట్ ఆరెంజ్, చీని, నిమ్మ తోటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చీని తోటల్లో అకుముడత ఆశించడానికి అనుకూలం.దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులను గమనించి రైతులు పిచికారి పనులు చేసుకోవాలి.

Horticultural crops

Horticultural crops

Also Read:Pests In Crops Due To Heavy Rains: వానాకాలం పంటలలో అధిక వర్షాల కారణంగా ఉదృతమయ్యె చీడపీడలు – నివారణ.

Leave Your Comments

Thummala Nageswara Rao: ఈ రోజు నుంచి పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి : మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు

Previous article

Minister Atchannaidu: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు

Next article

You may also like