Organic Woman Farmer: నా పేరు భువనేశ్వరి సెల్వం. నా చిన్నప్పటి రోజుల్లో పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. ఎటు చూసినా పచ్చని పొలాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం అవేం కనిపించడం లేదు. అందుకే సేంద్రియ వ్యవసాయంలోకి అడుగుపెట్టాను. నాకు మొదట నాలుగు రకాల సేంద్రియ వరి విత్తనాలు లభించాయి. వాటిని 12 ఎకరాల్లో నాటాను. అంతకుముందు సేంద్రియ వ్యవసాయం గురించి రకరకాల మాటలు విన్నాను. సేంద్రియ విధానంలో పంట చేతికి అందేందుకు చాలా సమయం పడుతుందని,ఈ విధానం ద్వారా అంతగా ప్రయోజనం ఉండదని చెప్పేవారు. అయినప్పటికీ నేను అవేం పట్టించుకోకుండా సేంద్రియ వ్యవసాయం చేపట్టి అధిక దిగుబడి సాధించాను.

Organic Paddy
Also Read: సేంద్రియ విధానంలో గులాబీ సాగు.. గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్
ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచ్చింది. నిజానికి ఆరోగ్యకరమైన దిగుబడిని నేను చూశాను. కరుపుకవుని, కిచిలీ సాంబా, జీరగా సాంబా, కులివేదిచెన్ వరి విత్తనాలను నేను నాటాను. అయితే కరుపుకవుని రకాలను పురాతన తమిళ రాజులు పండించేవారు. ఇలాంటి సాంప్రదాయ వంగడాలతో ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. అయితే విత్తనాలను నేను బయట నుండి కొనుగోలు చేయడం లేదు. వీటిలో ఎలాంటి జన్యు మార్పులు ఉండవు. ఇవన్నీ స్వచ్చమైనవి మరియు సహజసిద్దమైనవి మరియు రుచికరమైనవి కూడా. కాగా నేను సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు నాకు ఎవరూ సహకరించలేదు. కానీ ఇప్పుడు నా అడుగుజాడల్లో ఎంతో మంది నడుస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

karupukavuni
ప్రస్తుతం చాలామంది సహజసిద్ధమైన సేంద్రియ పంటల్ని పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహనా, మరియు నమ్మకం పెరగడం శుభపరిణామం అని అన్నారు మహిళా రైతు భువనేశ్వరి సెల్వం.
Also Read: సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం టాప్..