Success Story: వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ఎక్కువైంది. వాటి ధరలు రెక్కలు తొడిగి పెట్టుబడి రెట్టింపు అవుతోంది. భూమి నిస్సారం అవుతోంది. ఏటేటా దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సేంద్రియ వ్యవసాయం ఊపందుకుంది. ప్రాచీన కాలం నాటి వ్యవసాయంపై రైతులు శ్రద్ధ చూపిస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఈ క్రమంలో సేంద్రియ సాగు చేసి సిరుల పంట పండించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. తక్కవ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారు.
తెలంగాణా వాసి 56 ఏళ్ల దండు భూలక్ష్మి Dandu Bhulaxmi సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భూలక్ష్మి తన భర్తతో కలిసి మూడు ఎకరాల్లో టమోటాలు, బీన్స్, మిరపకాయలు మరియు క్యాబేజీలను పండిస్తున్నారు. అయితే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి అంశాలపై ఆమె మాట్లాడుతూ… మేము వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా చేస్తున్నాము. కానీ వ్యవసాయ-ఇన్‌పుట్‌ల అధిక ధర మమ్మల్ని ఎప్పుడూ ఆందోళన కలిగించేది. కానీ మాకు వేరే మార్గం లేకపోవడంతో వ్యవసాయం పైనే ఆధారపడాల్సి ఉండేది.
సేంద్రియ వ్యవసాయంపై మెళుకువలు నేర్చుకోవడానికి భూలక్ష్మి తానేజర్ అనే సంస్థ అమలు చేసిన సిద్దిపేట హార్టికల్చర్ ప్రాజెక్ట్‌లో చేరారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, దిగుబడిని పెంచడానికి, ఆదాయాన్ని పెంచడానికి సిద్దిపేట ప్రాజెక్ట్ ఆమెకు ఎంతో మేలు చేసిందని ఒక సందర్భంలో ఆమె తెలిపారు. ఆమె మాట్లాడుతూ… జనవరి 2017లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై టానేజర్ బృందం నుండి శిక్షణ పొందడం ప్రారంభించాను. ఈ ప్రాజెక్టు లో భాగంగా సేంద్రీయ బయో-ఎరువులు మరియు సహజ క్రిమిసంహారకాలను ఎలా తయారు చేయాలో మరియు ఎలా ఉపయోగించాలో భూలక్ష్మి మెళుకువలు నేర్చుకుంది. అదేవిధంగా కీటకాలను నియంత్రించడానికి ఫెరోమోన్ స్టిక్కీ ట్రాప్‌లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. మరియు టమోటా స్టాకింగ్ పద్ధతి, బిందు సేద్యం మరియు క్యాబేజీలను పెంచడానికి మల్చింగ్ షీట్‌లను ఉపయోగించడం వంటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నేర్చుకున్నారు.
Also Read: టెక్కీ టూ అభినవ్ కిసాన్ పురస్కారం.. సక్సెస్ స్టోరీ
ఇక భూలక్ష్మి తన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు సహాయ సహకార సంఘంలో చేరారు. ఆ సహకార సంస్థ ద్వారా ఆమె బిగ్ బాస్కెట్, రిలయన్స్ మరియు మెట్రో వంటి వ్యవస్థీకృత కొనుగోలుదారులకు మొత్తం టమోటాలు (1200 కిలోలు), బీన్స్ (2500 కిలోలు), మరియు దోసకాయలు (1500 కిలోలు) సరఫరా చేస్తుంది. ఇక భూలక్ష్మి విజయంపై టానేజర్ ఏమంటుంది అంటే.. భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం చాలా గర్వంగా ఉందని తెలిపింది. అదేవిధంగా టానేజర్ కృషికి భూలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. నా సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా, కూరగాయల రుచి మరియు నాణ్యతను మెరుగుపరిచే వ్యవసాయ పద్ధతులను నాకు పరిచయం చేసినందుకు టానేజర్‌కి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్న పెద్ద కొనుగోలుదారులకు సరఫరా చేస్తున్నాను. నేను గత ఖరీఫ్ సీజన్‌లో అర ఎకరం భూమి నుండి 12,000 లాభాన్ని పొందాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు నేర్చుకుని సాగు చేసి విజయం సాధించిన భూలక్ష్మికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
Also Read: జామ సాగు – రైతు విజయగాధ