Stray Cattle Menace: ఇప్పటి వరకి పశువులు రైతులకి, పంట పొలాలకి ఉపయోగపడటం మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో రోడ్డు ఫై, పంట పొలంలో విచ్చల విడిగా పశువులు తిరగడం మనం చూస్తున్నాం. ఈ పశువులు రోడ్డు ఫై తిరిగే జనాలకి ఇబ్బంది కలిగించడంతో పాటు పంట పొలంలో పంటని తిని రైతులకి నష్టం కలిగిస్తున్నాయి.
ఈ సమస్యకి పంట నిపుణులు కూడా రైతులకి వేరే వేరు పంటలు వేయకూడదు అన్ని చెపుతున్నారు. పంట మార్పిడితో పంటలు వేయడం వల్ల నేల కూడా ఆరోగ్యంగా అవుతుంది. కానీ పశువుల సమస్య వల్ల ఉత్తరప్రదేశ్ ప్రజలు చెరుకు, గోధుమలు తప్ప వేరే పంట వేయలేకపోతున్నారు.
ఈ ప్రాంత ప్రజలు మొక్కజొన్న, శెనగలు, పెసర్లు ఇలాంటి పంటలు వేస్తే పశువులు ఆ పంటని మొత్తం తిన్నడం మొదలు పెడతాయి. ఇలాంటి పంటలు వేయాలి అంటే రైతులు వారి పొలం దగ్గర పగలు, రాత్రి మొత్తం కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పశువులు పంట మొత్తం తిన్నడం వల్ల రైతులకి ఆఖరికి విత్తనాల ఖర్చు కూడా తనకే భారంగా మారిపోతుంది.
Also Read: G20 Agriculture Ministers Meeting Today: హైదరాబాద్లో నేటి నుంచి G20 వ్యవసాయ మంత్రుల సమావేశం
రైతులు నేల నాణ్యత కోసం వేరే పంటలు వేసిన, ఆ పంటకి కాపలా ఉన్న పశువులు రైతులపై దాడి చేయడంతో కొంత మంది రైతుల ప్రాణాలు పోయటం జరిగింది. రైతులు అందరూ కలిసి ఒకే పంట వేయడం ద్వారా పశువులు పంట పొలాల ఫై దాడి చేసిన అందరి పంటలో కొంచం తిన్నడం వల్ల నష్టం అందరి రైతులకి కొంచం తగ్గుతుంది.
భారత దేశంలో ఉన్న విధి పశువుల్లో 48% పశువులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఉన్నాయి. ఈ విధి పశువులని గోశాలలకి తీసుకొని వెళ్ళాలి కానీ గోశాలల పని తీరు సరిగా లేకపోవడం ద్వారా దాదాపు అని గోశాలలు మూసి వేశారు. గోశాలలో పని తీరు సరిగా లేకపోవడం వల్ల చాలా ఆవులు చనిపోయాయి. కొన్ని గోశాలలో ఒక ఆవుకి 5000 వరకి తీసుకుంటున్నారు. మరి కొన్ని గోశాలలో ఒక ఆవుకి 900 ప్రతి నెలకి కట్టాల్సి వస్తుంది. 900 డబ్బులు కట్టినా గోశాల వాళ్ళు వాటి గట్టి రేట్ పెరగటంతో ఈ డబ్బులు సరిపోవు అన్ని చెపుతున్నారు.
ఈ విధి పశువుల నుంచి పంట పొలాలని కాపాడుకోవడానికి పొలం చుటూ కంచె వేస్తున్నారు. కంచె వేయడానికి చాలా ఖర్చు అవ్వడం ద్వారా చిన్న రైతులు అంత ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు. కొన్ని గ్రామంలో పొలాలకి కాపరిని పెడుతున్నారు. ఈ కాపరిలు కూడా ప్రతి నెలకి 1000 రూపాయలు తీసుకోవడం ద్వారా రైతులకి ఇబ్బంది కలుగుతుంది.
Also Read: Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుకు ఊతమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం