Aeroponics Saffron Farming: కుంకుమ పువ్వు ఖరీదైన సుగంధ ద్రవ్యం అన్ని అందరికి తెలుసు. కుంకుమ పువ్వుని ఆయుర్వేద ఔషధాలో వాడుతారు. ఇప్పటి వరకి మనకి తెలిసి కుంకుమ పువ్వు ఒక కాశ్మిర్ ప్రదేశంలో మాత్రమే పండుతుంది. కుంకుమ పువ్వు పండించడానికి ప్రత్యేకమైన నేల, వాతావరణం ఉండాలి. వ్యవసాయంలో యాంత్రికరణతో ఇప్పుడు కుంకుమ పువ్వును అక్కడైనా, ఏ కాలంలో అయిన పండించుకోవచ్చు. కుంకుమ పువ్వు సాగు ఇంట్లోనే మట్టిలేకుండా ఏరోఫోనిక్స్ పద్దతిలో పండించుకోవచ్చు.
కొత్త విధానంతో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు మహారాష్ట్ర శైలేష్ మోదక్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శైలేష్ మోదక్ వ్యవసాయంపై ఆసక్తి ఉండటంతో ఆధునిక పద్ధతులని వాడుకుంటూ వ్యవసాయం మొదలు పెట్టి మంచి విజయం సాధించారు. ముందుగా ఏరోఫోనిక్స్ పద్దతిలో కూరగాయలు, పండ్లు పండించి మంచి లాభాలు పొందారు.
Also Read: Minister Niranjan Reddy: మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ – మంత్రి నిరంజన్ రెడ్డి
శైలేష్ మోదక్ కుంకుమ పువ్వు కూడా ఏరోఫోనిక్స్ పద్దతిలో పండిస్తున్నారు. శైలేష్ మోదక్ ఒక షిప్పింగ్ కంటైనర్‌లో కుంకుమ పువ్వు సాగు మట్టి లేకుండా ఏరోఫోనిక్స్ మొదలు పెట్టారు. కుంకుమ పువ్వు సాగు కోసం శైలేష్ మోదక్ 10 లక్షల పెట్టుబడి పెట్టారు. షిప్పింగ్ కంటైనర్‌లో 160 చదరపు అడుగుల స్థలంలో ఏరోఫోనిక్స్ టెక్నాలజీతో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు.
ఈ ఏరోఫోనిక్స్ పద్ధతిలో నీటిని స్ప్రింకిల్ర్ ద్వారా తుంపర్లల మొక్కల అందుతుంది. ఈ తుంపర్లలు పొగమంచుల మొక్కకు పోషకాలను సులభంగా అందుతాయి. ఈ ఏరోఫోనిక్స్ పద్దతిలో వ్యవసాయానికి తక్కువ స్థలం, సమయం, అధిక దిగుబడి వస్తుంది. విదేశాల్లో ఈ ఏరోఫోనిక్స్ పద్ధతిని ఎక్కువగా వాడుతారు. మనదేశంలో ఈ మధ్య కాలంలో ఉపయోగించడం మొదలు పెట్టారు.
Also Read: Green Manure: సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రాధాన్యత.!