రైతులువార్తలు

Rytu Bandhu in Mulugu: ములుగు జిల్లా రైతులకు తీపి కబురు.!

2
Rytu Bandhu in Mulugu
Rytu Bandhu in Mulugu

Rytu Bandhu in Mulugu: రైతు బంధు కోసం కొన్ని నెలలుగా ఎడతెరిపి లేని చూపు కళ్ళలో ఆనందం విరజిమ్మే రోజు వచ్చింది. పెట్టుబడులు లేక అప్పు ఇచ్చే నాథుడు దొరకక చెప్పుకోలేని అవస్థలు పడుతున్న రైతన్న కష్టం గమనించి రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ఈ వానాకాలం సీజన్ కోసం రైతు బంధు పంపిణీ ప్రారంభించింది. అప్పుల కోసం చెప్పులు అరిగేదాక తిరిగే అవసరం ఇక ఉండదు. ఈ డబ్బులు రావడంతో రైతులకు కొంత ఊరట లభించింది. మొదట ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ డబ్బులు రైతుల ఖాతాలలో దశలవారీగా పడనున్నాయి.

Rytu Bandhu in Mulugu

Rytu Bandhu in Mulugu

Also Read: Impact of Forest On Human Health: మానవుల ఆరోగ్యంపై అడవుల ప్రభావం.!

ఇప్పటి వరకు దాదాపు 33.63 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ములుగు జిల్లాలో 74,709 మంది రైతులు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఈ రైతులకు ఒక ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున 78.28 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయనున్నారు. ఇప్పటి వరకు 54,897 మంది రైతులకు కలిపి 36.68 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. మిగతా రైతులకు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు.

ములుగు జిల్లా పరిధిలో ములుగు మండలంలోనే అత్యధికంగా 17,091. మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అతితక్కువగా కన్నాయిగుడెంలో 4479 రైతులు ఉన్నారు. ప్రతి సంవత్సరం లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పోయిన వానాకాలంలో అనగా 2021 వానాకాలంలో 73,881 మంది రైతులు లబ్ధి పొందగా యసంగిలో 74,774 మంది లబ్ధ పొందారు. వానాకాలంలో 73,881 కోట్లు ఇవ్వగా యాసంగిలో 79.51 కోట్ల రూపాయలు రైతుల బాగు కోసం పంపిణీ జరిపారు. పోయిన వానాకాలంలో పోలిస్తే ఈ సంవత్సరం 828 మంది పెరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి. రామప్ప దేవాలయము ఉన్న వెంకటాపూర్ మండలంలో 7937 మంది రైతులకు 5.25 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Paddy Cultivation: వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.!

Leave Your Comments

Impact of Forest On Human Health: మానవుల ఆరోగ్యంపై అడవుల ప్రభావం.!

Previous article

How to Save Water: జలాల పరిరక్షణ ప్రతి పౌరుని భాద్యత.!

Next article

You may also like