రైతులు

AI and Bioengineering: వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్ ల పాత్ర.!

1
AI in Farming
AI in Farming

AI and Bioengineering: వ్యవసాయ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఎందుకంటే ఆవిష్కరణలకు సంబంధించిన విజ్ఞానం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ ఒక కొత్తరకమైన ఒరవడిని సృష్టిస్తుంది. ప్రపంచ ఆహార వినియోగం పెరగడం మరియు వాతావరణ సంక్షోభం అనేవి వ్యవసాయ ప్రపంచంలో రెండు కీలకమైన సవాళ్లుగా మారాయి. అయితే 2023లో వ్యవసాయ రంగంలో చూడవలసిన అత్యంత ప్రముఖమైన వ్యవసాయ పోకడలు ఏమిటి? అనే అంశం పైన చర్చిద్దాం.

1. కృత్రిమ మేధస్సు
వ్యవసాయ పరిశ్రమలో సాంకేతిక పరిణామాలు గత కొన్నేళ్లుగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనడంలో సందేహం లేదు. మనం డిజిటల్ యుగంలోకి వెళ్లేకొద్దీ సాంకేతికత పెరుగుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలోని అన్ని రంగాలలో ఇంటి పేరుగా కనిపిస్తుంది – కానీ వ్యవసాయంలో ఇది ఎలా ఉపయోగించబడుతుంది? అని ప్రశ్న అందరి మనసులను తొలుస్తోంది. మానవ మేధస్సును, ప్రవర్తనను సమర్ధవంతంగా కాపీ చేయడానికి రూపొందించబడిన AI అని పిలువబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ మెషీన్లు అనేవి రోజువారీ వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడతాయి. నేల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, పంటలలో తెగుళ్లును గుర్తించి వ్యాధులతో పోరాడడం వంటి వాటిలలో కృత్రిమ మేధస్సు ఉపయోగపడుతుంది. ప్రపంచ జనాభా పెరుగుదల సహజంగానే ఆహార ఉత్పత్తిలో డిమాండ్ పెరగడానికి దారితీసింది, కాబట్టి “చాలా చేతులు తేలికగా పని చేస్తాయి” అనే సామెత గతంలో కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు చక్కగా సరిపోతుంది.

Also Read: Organic Carbon: పంటల్లో సేంద్రియ కర్బనం పాత్ర.!

AI and Bioengineering

AI and Bioengineering

2. బయో ఇంజినీరింగ్
అధునాతన సాంకేతికత వ్యవసాయ పరిశ్రమకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. రైతులు వారి పనులను చక్కపెట్టుకోవడానికి అలాగే రోజువారీ సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి బయో ఇంజినీరింగ్ వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ DNA మరియు RNAలను సవరించడం ద్వారా జన్యుపరంగా మార్పు చెందిన ఉత్పత్తులను సృష్టించి సాంకేతికంగా అధునాతన సాధనాలను కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండింగ్‌లో ఉంది? మరి ఇది రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుంది? అనే ప్రశ్నలు అయితే లేవెనెత్తుతున్నాయి. బయో ఇంజినీరింగ్ పంట నాణ్యతను పెంచడమే కాదు, ఉదాహరణకు.. ఇది పంట వ్యాధిని నిర్మూలించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. 2023లో, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్ కారణంగా నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో బయో ఇంజినీరింగ్ గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది.

Also Read: Nelavemu Farming: ఆయుర్వేద మొక్క నేలవేము సాగు.!

Leave Your Comments

PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి సాంకేతిక సదస్సు ప్రారంభం.!

Previous article

Minister Niranjan Reddy: తెలంగాణ మొక్కజొన్న రైతులకు శుభవార్త.!

Next article

You may also like