Farmers Income: 2015-16లో 2022-23 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచడంతోపాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలను ప్రారంభించింది.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా పెట్టుబడులకు మద్దతు, ఎగుమతి ప్రోత్సాహకాలకు అవకాశం, రైతులు తమ ఉత్పత్తుల కోసం మార్కెట్‌లను స్థాపించడంలో సహాయం అందించనుంది ప్రభుత్వం. విభిన్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం అదనపు రవాణా, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ప్రోత్సాహకాలు ఇందులో ఉండనున్నాయి. కొత్త ప్రత్యేక మంత్రిత్వ శాఖతో సహకార విభాగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోనున్నారు.
Also Read: అమెరికా క్యాప్సికం సాగుపై తెలుగమ్మాయి అనుభవాలు
లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రూ.10,900 కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకం స్కీమ్ కంటే ఎక్కువ ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. FY20లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్థూల విలువ జోడింపు (GVA) రూ.2.24 లక్షల కోట్లు, మొత్తంలో 1.7% దోహదపడింది. ఆహార ప్రాసెసింగ్ రంగంలోని జివిఎ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో జివిఎలో 11.38% వాటాను కలిగి ఉంది.
క్రెడిట్ మద్దతు ద్వారా ఒకే పంటపై ఆధారపడిన రైతులకు ఆదాయ వైవిధ్యీకరణలో సహాయపడే సమగ్ర మద్దతు ప్రణాళిక కూడా చర్చలో ఉందని ఓ అధికారి తెలిపారు. ప్రాంతీయ లేదా స్థానికంగా కాకుండా ప్రతి వ్యవసాయ వస్తువుకు గ్లోబల్ ను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించబడాలి అని మహీంద్రా ఆర్థికవేత్త సచ్చిదానంద్ శుక్లా అన్నారు.
ప్రాసెసింగ్ పరిశ్రమను రిటైల్‌తో అనుసంధానించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇది ఫామ్-టు-ఫోర్క్ ఛానెల్‌లను వేగవంతం చేస్తుందని మరియు రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం శీతల గిడ్డంగులతో సహా లాజిస్టిక్స్‌లో పెట్టుబడులను వేగవంతం చేయాలి లేదా ప్రోత్సహించాలి అని ఆయన చెప్పారు.
Also Read: మనోధైర్యమే మహిళా రైతును చేసింది