ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Soyabean: సోయాచిక్కుడులో పల్లాకు తెగులు..

0
Soyabean

Soyabean: సోయాచిక్కుడు కాయజాతి (లెగ్యూమ్),నూనెగింజల పంట. దీనిలో 43 శాతం మాంసకృత్తులు, 20 శాతం నూనె ఉంటుంది.ఆదిలాబాద్ జిల్లాలో ఈ పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. పల్లాకు(ఎల్లో మొజాయిక్)తెగులు ఉధృతి ఈ జిల్లాలో ఎక్కువగా ఉంది.ఈ తెగులు ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది.

Soyabean

లక్షణాలు:

అకులు,కాయలమీద పసుపు పచ్చ పొడలు ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారుతుంది. తెల్లదోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది.తెగులు సోకిన మొక్కలను మొదట్లోనే గుర్తించి వాటిని పీకి నాశనం చేయాలి.తెగులు సోకిన పొలం నుంచి విత్తనం సేకరించరాదు.

నివారణ:

పసుపు రంగు జిగురు డబ్బాలు ఎకరానికి 10 అమర్చాలి. థయోమిథాక్సమ్ 40 -50 గ్రా./200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మొక్క తొలిదశలో వేపనూనె (1500 పి.పి.ఎం.) 5 మి.లీ./లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దెపురుగు:

తల్లిపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి పచ్చదనాన్ని గీకి తింటాయి.దీంతో ఆకులు జల్లెడలాగా మారుతాయి.ఆకులకు రంధ్రాలు చేసి,ఆకులను,పూలను,కాయలను తింటాయి.
నివారణ:లీటరు నీటికి 2.5 మి.లీ.క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రా.ఎసిఫెట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి.

డా.బి.రాజేశ్వరి, డా.శ్రీధర్ చౌహన్, డా.భానురేఖ, డా.అనిత, డా.సురేష్,
వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్

Also Read: Karonda Tree: వాక్కాయ చెట్లతో చేనుకు జీవ కంచె..పండ్లకు విలువ జోడిస్తే ఆరోగ్యం, ఆదాయం

Leave Your Comments

Uses Of Neem: వ్యవసాయంలో వేప వినియోగం

Previous article

Processing Of Pulses: పప్పుధాన్యాల ప్రాసెసింగ్ తో ఆదాయం, ఆరోగ్యం

Next article

You may also like