Farmers Success Story: మహారాష్ట్రలోని చాలా మంది రైతులు ఇప్పుడు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు పాల్ఘర్ రైతులనే తీసుకోండి. ఈ రోజుల్లో స్ట్రాబెర్రీలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.ఉద్యాన పంటల సాగులో ఇప్పుడు వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. సంప్రదాయ వ్యవసాయంతో తమకు అంత లాభం రావడం లేదని రైతులు నిరాశ నుంచి బయటకు వచ్చి ఉద్యాన పంటలపై దృష్టి పెడుతున్నారు.
వ్యవసాయ శాఖ మార్గదర్శకాలతో మేము మొదటిసారిగా స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించాము. ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలోని చాలా మంది రైతులు ప్రస్తుతం పూల సాగుపై దృష్టి సారించారు.ఈ సమయంలో చిన్న పొలం నుంచి రోజూ 20 నుంచి 25 కిలోల స్ట్రాబెర్రీలను తీస్తామని యువ రైతు తెలిపారు. ఈ వ్యవసాయంతో ఇప్పుడు గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
పాల్ఘర్ జిల్లా జవహర్ ముఖోడా తాలూకాకు చెందిన రైతు భవేష్ మాట్లాడుతూ.. ఇంతకుముందు వరి సాగు చేసేవారని, వాతావరణం మారుతున్నందున ఖర్చులు భరించలేక వ్యవసాయాన్ని మార్చుకోవాలని అనుకున్నామని చెప్పారు. ఈ సాగుకు వ్యవసాయ శాఖ మొదట శిక్షణ ఇచ్చింది. తర్వాత ఆ శాఖ మార్గదర్శకత్వంలో స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించాం. దీని ద్వారా మాకు మంచి లాభాలు వస్తున్నాయి. నేను నా 1 ఎకరం భూమిలో స్ట్రాబెర్రీలను పండించాను. దాంతో రోజుకు 20 నుండి 25 కిలోల వరకు దిగుబడి ఉందన్నారు. . ఇందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తున్నందున ఉద్యాన పంటల సాగు కొనసాగిస్తామని ఆ రైతులు చెప్తున్నారు.
స్ట్రాబెర్రీ సాగుకు దాదాపు 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. మార్కెట్‌లో కిలో రూ.200 చొప్పున విక్రయిస్తాం. మేము పాల్ఘర్ నుండి ముంబై, నాసిక్, థానే ఈ ప్రాంతాలకు స్ట్రాబెర్రీలను పంపుతాము. ప్రస్తుతం బీకాం చదువుతున్నట్లు భవేష్ తెలిపాడు. చదువుల అనంతరం మంచి లాభాలు వస్తున్నందున పెద్ద ఎత్తున హార్టికల్చర్ సాగు చేస్తాం. దీంతో గ్రామంలోనే ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుంది. గిరిజన రైతులకు ఈ సాగుకు ప్రభుత్వం రాయితీ కల్పించాలని రైతులు కోరారు.
వ్యవసాయ అధికారి అనిల్ గావిత్ తాలూకాలోని రైతులందరినీ ఏకం చేసి స్ట్రాబెర్రీ సాగుపై అవగాహనా కల్పించారు. ఈ క్రమంలో ఆ రైతులు విజయవంతంగా ప్రయోగాలు చేశారని అయన అన్నారు. పాల్ఘర్ జిల్లాలోని జవహర్ మరియు మోఖడా తాలూకాలలోని మారుమూల ప్రాంతాల్లోని గిరిజన రైతులకు ఆధునిక వ్యవసాయంపై గావిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
నిజానికి పాల్ఘర్ జిల్లాలోని జవహర్ మరియు మోఖడ తాలూకాలలో మారుమూల గిరిజన ప్రాంతాల రైతులు సాంప్రదాయకంగా రాగి మరియు వరి సాగు చేస్తారు. ఇది తప్ప మరే ఇతర పంటలు పండడం లేదు. ఉపాధి లేకపోవడంతో ఇక్కడ నిరుద్యోగం పెరిగింది. జీవనోపాధి కోసం పెద్ద సంఖ్యలో గిరిజన కుటుంబాలు నగరానికి వలస వెళ్తున్నాయి. అందుకే కొన్నేళ్లుగా పోషకాహార లోపం, పిల్లల మరణాల కారణంగా ఈ తాలూకా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు కొందరు గిరిజన రైతులు స్వయంగా ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నిర్ణయం వారి జీవితాన్నేమార్చేసింది. అంతేకాకుండా ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.