తెలంగాణరైతులువార్తలు

Minister Nirajan Reddy: యాసంగి పత్తి సాగు ఎంతో బాగు.!

0
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Nirajan Reddy: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం బస్వాపురంను సందర్శించి యాసంగిలో పత్తి సాగు చేస్తున్న రైతు వెంకటేశ్వర్లును కొణిజెర్ల రైతువేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు.

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

Also Read: Cotton Flower Dropping: పత్తిలో పూత, పిందే రాలటం – నివారణ పద్ధతులు.!

అయితే ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • డిసెంబరులో సాగు మొదలు .. ఏప్రిల్ లో దిగుబడి మొదలు.
  •  మిరప పంట నష్టంతో పత్తి వైపు మళ్లిన రైతు .. నష్టాలతో పత్తి సాగు.
  • యాసంగిలో పత్తి సాగు చేయాలని చెబుతున్న ఖమ్మం రైతు.
  • 24 గంటల కరంటు, సాగునీరు అందుబాటులో ఉన్నందున యాసంగి పత్తి సాగు లాభదాయకం.
  • తెలంగాణ రైతాంగం యాసంగి పత్తి సాగుపై దృష్టి సారించాలి.
  • పత్తిలో యాసంగి సాగును అనుసరించి నాంది పలికారు.
  • పంటల వైవిద్యీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది.
  • తెలంగాణ భూములు పత్తి సాగుకు అత్యంత అనుకూలం.
  • ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో భారత్ ది అగ్రస్థానం.. కానీ ఉత్పాదకతలో వెనకబడి ఉంది.
  • పత్తి సాగులో ఉత్పాదకత పెంచే రకాలు, యాంత్రీకరణ, యాసంగి పత్తి సాగుపై ప్రభుత్వ దృష్టి సారించింది.
  • రైతాంగం వానాకాలంతో పాటు యాసంగిలో పత్తి సాగు చేయాలి.
  • ఎన్నో ఏళ్లు కష్టపడి రైట్ సోదరులు విమానం కనుగొన్నారు.
  • యాసంగిలో పత్తిని సాగుచేసి వెంకటేశ్వర్లు కొత్త చరిత్రను సృష్టించి అందరికీ ఆదర్శమయ్యారు.
  • వ్యవసాయ సాగులో నూతన విప్లవం సృష్టించి రైతాంగానికి ఆదర్శంగా నిలిచినందుకు నేను స్వయంగా వచ్చి అభినందించడానికి వచ్చాను అని అన్నారు.
  • ఆదిమ సమాజం నుండి నేటి వరకు మనిషి మెదడులో వచ్చిన ప్రశ్న .. దానికి పరిష్కారం వెతకడంలో వచ్చిన జవాబే శాస్త్ర పరిశోధన.
  • పంటసాగులో వచ్చిన సూక్ష్మసేద్యం కనుక్కున్నది ఒక ఇజ్రాయిల్ సామాన్య రైతే .. ఆ పరిశోధనలో భాగంగానే మొక్కకు అవసరమైన నీటిని అందించే ప్రక్రియ మొదలయింది.
  • శాస్త్రవేత్తలతో పాటు రైతులు కూడా మంచి పరిశోధకులే.
  • మనిషి పుట్టినప్పటి నుండి ప్రయోగాలు కొనసాగుతున్నాయి .. హేతుబద్దతతో ఆలోచించిన వారే పరిశోధనలో క్రియాశీలకంగా ముందుకు సాగుతున్నారు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కీలకశాఖ నా మీద నమ్మకంతో నా చేతిలో పెట్టారు .. వారి ఆలోచనల మేరకు చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నాం.
  • తెలంగాణలో సాగునీరు సమృద్ధిగా పెరగడంతో పంటల వైవిద్యీకరణపై దృష్టి పెట్టాం.
  • ఈ నేపథ్యంలోనే పత్తి సాగులో అధిక సాంధ్రత పత్తి సాగును ప్రోత్సహిస్తున్నాం.

పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని రైతువేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పేర్కొన్నారు.

Also Read: Cotton Cultivation: ప్రత్తి పంట లో వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Dairy Cattle: పాడి పశువులను ఎంపిక ఎలా చేసుకోవాలి.!

Previous article

Barren Vegetation: వివిధ రకాల బంజరు భూములలో అనువైన వృక్షాల పెంపకం.!

Next article

You may also like