ఇది 32 ఏళ్ల వయసు గల ఎం . దుర్గాదేవి కథ. రక్త క్యాన్సర్ను నయం చేయడంలో ప్రకృతి వ్యవసాయం ఎలా సహాయపడిందో మనం పరిశీలించవచ్చు. 9 సంవత్సరాల వయస్సులో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నతమ కుమార్తె చికిత్స కోసం దుర్గాదేవి కుటుంబం ఆస్తులన్నింటినీ అమ్మి సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిట్ట చివరగా కౌలు భూమిలో అనుసరించిన ప్రకృతి వ్యవసాయ విధానంలో పరిష్కారాన్నికనుగొన్నారు. గతంలో చికిత్స కోసం నెలకు రెండుసార్లు చెన్నై నగరంలోని డాక్టర్ని కలిసేవారు, ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి మాత్రమే డాక్టర్ని సంప్రదిస్తున్నారు. వైద్యులు కూడా అమ్మాయి ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదలని చూసి ఆశ్చర్యపోయారు.
షెడ్యూల్డ్ కులానికి చెందిన ఎం.దుర్గాదేవి తన కుటుంబంతో బాపట్ల జిల్లా గోవాడ గ్రామంలో నివసిస్తోంది. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఆమెకు ఎం. సాయిరామ్తో వివాహం జరిగింది. అప్పటి నుంచి వ్యవసాయంలో తన భర్తకు సహాయం చేస్తూ వస్తోంది. తమకున్న 1.5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకొంటూ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. 2016లో దుర్గ దేవి పెద్ద కుమార్తె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అమ్మాయి రిపోర్టులను పరిశీలించిన వైద్యులు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. అకస్మాత్తుగా బయటపడ్డ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి దుర్గాదేవి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైంది.కూతురు చికిత్స కోసం దుర్గ దేవి కుటుంబం ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. చికిత్స కోసం కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఫలితాలు మాత్రం మారలేదు. చికిత్స ఖర్చుల కోసం తమ 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మేశారు.
ఆసుపత్రికి నిరంతరం సందర్శిస్తూ చివరకు ఆశ కోల్పోయే దశకు చేరుకున్నారు. చివరకు జీవనోపాధి కూడా కష్టమని భావించారు.
SHG సమావేశంలో భాగంగా, దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయం (NF) గురించి తెలుసుకున్నారు. APCNF ప్రాజెక్ట్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల కలిగే ఆరోగ్య మరియు పోషకాహార ప్రయోజనాలను వివరించారు. ఆ సమావేశం అనంతరం వారి జీవితంలో ఓ చిన్న ఆశ వెలుగుచూసింది. 2018లో కిచెన్ గార్డెన్తో పాటు వరి పొలం కూడా నిర్వహించడానికి 1 ఎకరం మరియు 1 సెంటు భూమిని లీజుకు తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి కూరగాయలు మరియు వరి సాగు ప్రారంభించారు. ఇది శ్రమతో కూడుకున్నప్పటికీ, దుర్గాదేవి మరియు ఆమె భర్త పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంనే అనుసరించారు. ప్రకృతి వ్యవసాయ ఆహారాన్ని మాత్రమే తినడం ప్రారంభించారు. ఆ సమయంలో మ కూతురు ఆరోగ్యంలో వచ్చిన మార్పును గమనించారు. క్రమంగా వైద్యులతో సంప్రదింపులు బాగా తగ్గిపోయాయి. 3 నెలలకు ఒకసారి వెళ్ళే దశకు చేరుకొన్నారు.
బ్లడ్ క్యాన్సర్ అనే పదం నుంచి ఇప్పుడు పూర్తిగా విముక్తి పొందాం. నా కూతురు 10వ తరగతి చదువుతోంది. మా వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వచ్చామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. కుటుంబ పోషణ తర్వాత మిగిలిపోయిన కూరగాయలను అమ్ముతున్నాం. కొన్ని కూరగాయలను ఇరుగుపొరుగు వారికి మరియు తోటి ఎస్హెచ్జి సభ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మేము (నా కుటుంబం) APCNF క్యాడర్కు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను నా తోటి SHG సభ్యులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరిస్తూ ప్రోత్సహిస్తున్నాను. అని దుర్గాదేవి తన అభిప్రాయం వెలిబుచ్చింది.
గమనించిన ప్రధాన మార్పులు:
NFని స్వీకరించిన తర్వాత | NFని స్వీకరించే ముందు |
స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో ఇన్‌పుట్‌లను సిద్ధం చేసుకొంటున్నాం | సింథటిక్ ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడానికి కమీషన్ ఏజెంట్లు/ఫైనాన్స్ వ్యక్తులపై ఆధారపడి ఉండేది |
పెరిగిన దిగుబడితో చూస్తే ఉత్పత్తి ఖర్చు దాదాపు సున్నా | దిగుబడి తగ్గడంతో ఉత్పత్తి వ్యయం క్రమంగా పెరుగుతుంది |
బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్‌లను పిచికారీ చేసేటప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించవు | చర్మ అలెర్జీలు మరియు శ్వాసకోశ సమస్యలు నమోదు చేయబడ్డాయి |
ఆదాయ వ్యయ వివరాలు
విశేషాలు | ప్రకృతి వ్యవసాయం | సంప్రదాయ వ్యవసాయం |
భూమి తయారీ | 1200 | 2600 |
సీడ్ ఖర్చు | 1000 | 1000 |
మార్పిడి | 3000 | 3000 |
సహజ & సింథటిక్ ఇన్‌పుట్‌లు | 2800 | 6000 |
కలుపు తీయుట | 0(మాన్యువల్ కలుపు తీయడానికి కుటుంబ కార్మికులు) | 2600 (హెర్బిసైడ్స్ కోసం) |
సాగు మొత్తం ఖర్చు | 8000 | 15200 |
దిగుబడి/ఎసి(బ్యాగులు) | 23(75కిలోల బ్యాగ్) | 27(75కిలోల బ్యాగ్) |
ధర/బ్యాగ్(రూ.) | 2000 | 1300 |
స్థూల ఆదాయం | 46,000 | 35,100 |
నికర ఆదాయం (రూ.) | 38,000 | 19,900 |
బి: సి నిష్పత్తి | 1: 4.75 | 1: 1.3 |