ప్రకృతి వ్యవసాయంలో పలు నమూనాలు
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మెంటార్ మహేష్ కుమార్
ప్రాధమిక సమాచారం
నమూనాలు
ఏ గ్రేడ్
ఏటీఎం
డ్రాట్ ప్రూఫ్
సూర్య మండలం
డ్రాట్ ప్రూఫ్ మోడల్
పంట విత్తిన తేదీ : 9 జనవరి , 2024
విస్తీర్ణం : 25 సెంట్లు
మొత్తం పంట రకాల సంఖ్య : 8
పంట రకాలు : కంది, ఆముదం, టొమాటో, వంగ, నువ్వులు, ఆవాలు, అలుసంద
పండ్ల రకాలు : మామిడి, సపోటా,మహాగని,జామ,అంజీరా,ఆపిల్ బేర్
ఖర్చు : రూ 2200 లు
ఆదాయం : రూ 21500 లు
ఏటీఎం నమూనా
పంట విత్తిన తేదీ : జూన్ , 2023
రకాలు : రాడిష్, బీట్రూట్, క్యారెట్, మొక్కజొన్న, వంగ, టమోటా, మిర్చి,అలుసంద, వేరుశనగ, ఆకుకూరలు, మహాగని, మామిడి.
ఆదాయ వ్యయ వివరాలు
ఖర్చు : రూ 1600 లు (కేవలం విత్తనాల కోసం)
ఆదాయం : రూ 1,30,000.00 లు
ఏ గ్రేడ్ ( 5 లేయర్ మోడల్) పంట విత్తిన తేదీ : నవంబర్ 2023
విస్తీర్ణం : 1.5 ఎకరాలు
పంట మొత్తం రకాలు : 20
ప్రధాన పంటల వివరాలు: లిల్లీ, మామిడి,జామ,మహాగని,మునగ,వంగ,మిరప,టొమాటో,వక్క,బెండ
బయో డైవర్శిటీ పంటలు: కంది, అవిస,కొబ్బరి, ఆపిల్, వాటర్ ఆపిల్ ,అల్లనేరేడు,పనస,లిచ్చి,అరటి,బట్టర్, స్టార్,నిమ్మ,స్వీట్ లెమన్,చెర్రీ,అంజీర,డ్రాగన్, కాఫీ తో పాటు 6 రకాల ఆకుకూరలు
ఖర్చు (ఏడాదికి ) : రూ 50000 లు
ఆదాయం : రూ 70000 లు (ఒక్క కూరగాయల నుంచి)
సూర్య మండలం నమూనా
పంట విత్తిన రోజు : 4 జనవరి 2024
పంటల సంఖ్య : 15
పంట రకాలు : మెంతి, గోంగూర, పాలకూర, బెండ, టొమాటో, వంగ, మిరప, చిక్కుడు, అనప, అలసంద, కాకర, బీర, బీట్రూట్, మామిడి, జామ
ఖర్చు : రూ 300 లు
ఆదాయం : రూ 2700 లు
ఆచరించిన పద్ధతులు
● ఘన, ద్రవ జీవామృతం మాత్రమే వినియోగించడం జరిగింది
● ఒకే ఒకసారి మొక్కల పెరుగుదల కోసం పంచగవ్య వాడటం జరిగింది
● పురుగు బెడద పూర్తిగా తొలగిపోయింది
● అధిక భాగం సొంత విత్తనాల వినియోగం
● ఉమ్మెత్త కషాయం, అగ్నిఆస్త్రం వాడటం జరిగింది
● వరిలో 4 రకాల మట్టితో ప్రయోగం చేయడం జరిగింది
మార్కెటింగ్
టమాటా, బీన్స్, వంగ, మిరప, లోకల్ మార్కెట్ లొ అమ్మడం , సజ్జ, జొన్న మొక్కజొన్న, రాగి, కంది,మినుములు, పెసర, నువ్వులు పీఎండీఎస్ కిట్స్ రూపంలో అమ్మడం. ఆకుకూరలు, మునగ, కూరగాయలు గ్రామంలో అమ్మడం జరుగుతుంది.
ప్రకృతి వ్యవసాయం వలన కలిగిన ప్రయోజనాలు
✔ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన చాలా పిచ్చుకలు వచ్చి చేరుతున్నాయి. అనేక పక్షి గూళ్ళు దర్శనమిస్తున్నాయి. అక్షింతల పురుగులు,సీతాకోక చిలుకలు, కందిరీగలు,తేనెటీగలు,తుమ్మెదలు ఉన్నాయి.
✔ వానపాముల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది
✔ 1000 మహాగని మొక్కలు నాటడం జరిగింది. రెండు అడుగుల మొక్క నాటగా 5 నెలల కాలంలో 10 అడుగుల ఎత్తు వరకు పెరిగింది
✔ రోజుకు 3 కేజీ ల చొప్పున లిల్లీ పంట 3 నెలల పాటు వచ్చింది. మరో అయిదేళ్ళ పాటు పంట నిరంతరం వస్తుంది
✔ దీర్ఘకాలిక పంటల దిగుబడి ఇంకా రావలసి ఉంది
✔ ఇసుక నేల అయినప్పటికీ ఘన, ద్రవ జీవామృతం వల్ల నేల సారూప్యం లో చాలా మార్పు వచ్చింది
రైతు అభిప్రాయాలు
ఏటీఎం మోడల్ కంటే ఏ గ్రేడ్ వల్ల అధిక ప్రయోజనం కనిపిస్తోంది. ఏటీఎం నమూనా లో త్వరితగతిన రీ సోయింగ్ చేయాల్సి వస్తోంది. గుంటూరు జిల్లాలో పాలేకర్ గారి శిక్షణలో మొదటిసారి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొన్నాను. ఏపీసీఎనన్ఎఫ్ సిబ్బంది ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానంలోని అన్ని ప్రోటోకాల్స్ ను తప్పక అనుసరిస్తున్నాను. స్వతహాగా ఘన, ద్రవ జీవామృతం, ఇతర కషాయాలు తయారు చేసుకొంటున్నాను. ఎటువంటి పురుగుమందులు, రసాయన ఎరువులు ఇప్పటివరకు వాడలేదు. ఈ కషాయాలు వాడడం వలన పెట్టుబడి తక్కువగా గమనించాను. ఘనజీవామృతం ద్రవ జీవామృతం, కషాయాలు, నీమాస్త్రం వాడడం వలన మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో కూడా నా పంట తట్టుకొని నిలబడింది. కాపు బాగా ఉండటంతో దిగుబడి కూడా బాగా వచ్చింది .నా పొలం చూడటానికి మాతోటి రైతులు కూడా వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మంచి ఆరోగ్యం పొందగలిగాను.
రైతు పేరు : రామిశెట్టి మహేష్ కుమార్
హోదా : మెంటార్