Natural Farmer Venkataramana Success Story: రైతు శాస్త్రవేత్త కోర్సు ద్వారా ప్రకృతి వ్యవసాయంలో దాగియున్న సైన్స్ ను అర్థం చేసుకోగలుగుతున్నాము. ప్రకృతి వ్యవసాయానికి అవసరం అయ్యే అన్ని కషాయాలు స్వతహాగా తయారు చేసుకొంటున్నాం. ఇంటికి అవసరం అయ్యే వస్తువుల్లో 90 శాతం మా వద్దే దొరుకుతున్నాయి. మార్కెట్ కు వెళ్ళే అవసరం లేకుండా పోతోంది. నేల సారూప్యంలో కూడా ఎంతో మెరుగుదల కనిపిస్తోంది. ఆదాయంతో పాటు ఆరోగ్యం లభిస్తోంది.
గత ఏడేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం గడించిన కే ఎం వెంకట రమణ అభిప్రాయం ఇది.
గతంలో రైతు సాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్ గా పనిచేస్తూ ప్రస్తుతం మెంటార్ గా పనిచేస్తున్న వెంకట రమణ ప్రకృతి వ్యవసాయంలో సత్ఫలితాలు సాధిస్తూ అనేక ప్రయోజనాలు పొందగలుగుతున్నాడు. కేవలం 7 నెలల కాలంలో 30 వేల రూపాయల పెట్టుబడితో 3 లక్షల రూపాయల నికర ఆదాయం పొందాడు. మరో రెండు నెలల్లో ఇంకో లక్ష రూపాయల ఆదాయం సమకూరనుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయ సూత్రాలకు అనుగుణంగా దున్నడం పూర్తిగా మానుకొని సొంత విత్తనాలనే వాడుతూ తనకున్న 3.35 ఎకరాల విస్తీర్ణంలో రెండు మోడల్స్ తో పాటు వరిలో ప్రయోగం కూడా చేస్తున్న వెంకట రమణ విజయ గాధ గురించి తెలుసుకొందాం.
ప్రాధమిక సమాచారం
పేరు : కే ఎం వెంకట రమణ
హోదా: మెంటార్
మొబైల్ నెంబర్: 9949466349
గ్రామం: అంకిరెడ్డిపల్లి
యూనిట్ : విజలాపురం
జిల్లా : చిత్తూరు
పొలం: 3.35 ఎకరాలు
ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం:
3.35 ఎకరాలు
ప్రకృతి వ్యవసాయంలో అనుభవం:
7 సంవత్సరాలు
జులై 2023 నుంచి మెంటార్ గా పనిచేస్తున్నారు
పశుసంపద: 3 ఆవులు
నీటి సౌకర్యం: బోర్ వెల్
నేల రకం : మిక్స్డ్ సాయిల్
మోడల్స్
ఏ గ్రేడ్ : 2 ఎకరాలు
ఏటీఎం : 20 సెంట్లు
వరి ప్రయోగం : 30 సెంట్లు
(అటవీ చైతన్య ద్రావణం Vs ప్రకృతి వ్యవసాయం Vs రసాయన వ్యవసాయం
ఏ గ్రేడ్ :-
సెప్టెంబర్ 2023 (పీఎండీఎస్ తో మొదలు)- కలియదున్ని రీ సోయింగ్ చేయడం
● ప్రధాన పంటలు : మహాగని, మల్బరీ, బొప్పాయి, మునగ, మల్లె, వంగ, మిరప, టొమాటో, కొబ్బరి, బిర్యానీ ఆకు, ఆవుకాడ, యాలుక, అంజీరా, డ్రాగన్ ఫ్రూట్, కరివేపాకు, కనకాంబరాలు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, నువ్వులు, పెసర, మినుములు, ఆముదం, కాకర, బంతి , ఆవాలు.
● పండ్ల రకాలు: మామిడి, నేరేడు, జామ, సీతాఫలం, రామఫలం, ఆరెంజ్, గ్రీన్ ఆపిల్, పనస, ఉసిరి, నిమ్మ
● సరిహద్దు పంటలు: వక్క, అవిసె
మొత్తం 40 రకాలు
ఏ గ్రేడ్ ఖర్చు : రూ 30,000.00 లు
నికర ఆదాయం : రూ 3,00,000.00 లు (ఇప్పటివరకు) అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు
(మరో రెండు నెలల్లో మరో లక్ష రూపాయల దాకా వస్తుందని వెంకట రమణ అంచనా)
ఏటీఎం
● విస్తీర్ణం : 20 సెంట్లు
● ఆరంభం : సెప్టెంబర్ 2023
● ప్రధాన పంట: బీట్రూట్, క్యారెట్, ముల్లంగి
● బయో డైవర్శిటీ పంటలు : కంది, ఆముదం, వంగ , మిరప, బెండ, అలుసంద, బొప్పాయి, మునగ.
● మహాగని,కొత్తిమీర,మెంతి, పాలకూర, చిర్రకు, బీర, కాకర,
● సరిహద్దు పంటలు : అవిసె, వక్క, జామ
● ఖర్చు : రూ 15000.00 లు (ఏడాదిలో)
● నికర ఆదాయం : రూ 1,50,000.00 (ఏప్రిల్ నెలాఖరునాటికి)
ఆచరించినపద్ధతులు
● ఘన, ద్రవ జీవామృతంతో పాటు పంచగవ్య, ఎగ్ అమినో యాసిడ్,చేప ద్రావణం వినియోగం
● కేవలం అవసరమైన సమయంలోనే కషాయాలు వాడటం
● ఎన్ పీ ఎం దుకాణం నడుపుతూ స్వతహాగా కషాయాలు తయారుచేసుకోవడం
● నేల స్వరూపాన్ని మార్చడం కోసం 300 ట్రిప్పుల అడవి మట్టిని డంప్ చేసి నేలను సారవంతం చేశాడు
● రెండు ఎకరాల్లో 3 విడతలుగా 1000మహాగని మొక్కలు నాటడం జరిగింది.
● మొక్క మొక్కకు మద్య దూరం 10 అడుగులు
● మహాగని మధ్యలో ప్రతి 2.5 అడుగులకు మునగ, మల్లె, బొప్పాయి నాటడం జరిగింది.
● అక్టోబర్ లో నాటిన మహాగని (6 నెలలకు) 5 అడుగులు పెరిగింది
● వారానికి ఒకసారి మహాగని మొక్క పాదు దగ్గర 2 లీటర్ల నీరు, 15 రోజులకు ఒకసారి 100 ఎం ఎల్ ద్రవ జీవామృతం పారించడం
● మహాగని వరుస వరుస కు 9 అడుగులు (మధ్యలో 4.5 అడుగులకు మల్బరీ)
● మల్బరీ ప్రతి 2.5 అడుగుకు ఒక మొక్క
● పురుగు సమస్య అస్సలు లేదు
● మల్బరీ లో టొమాటో
● డ్రిప్ విధానం అమలు