సొంత విత్తనాలతో వ్యవసాయం – కషాయాలకు స్వస్తి
పశువుల అనుసంధానంతో ఏడాది పొడవునా పచ్చదనం
Krishnamurthy Success Story: ఎన్ పీ ఎం (Non Pest Management) కాలం నుంచి వ్యవసాయంలో ఎంతో అనుభవం గడించిన కృష్ణమూర్తి గత ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రశంసలు అందుకొంటున్నాడు.
• రైతు సాధికార సంస్థ నేతృత్వంలోని ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో (L1) యూనిట్ ఇన్చార్జి గా పనిచేస్తూ మెంటార్ గా పదోన్నతి పొందిన కృష్ణమూర్తి నేలను దున్నకుండా ఎలాంటి కషాయాలు వాడకుండా సొంత విత్తనాలతో ఏడాది పొడవునా పశుసంపదను జోడించి పలు పంటలతో సమీకృత వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను తప్పకుండా పాటిస్తున్నాడు. రైతు శాస్త్రవేత్త కోర్సు లో నేర్చుకొన్న విద్యను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. పురుగు సమస్యను పూర్తిగా అరికట్టగలిగాడు. ఘన, ద్రవ జీవామృతం తప్ప మేరే ఇతర కషాయాలు అవసరం లేదు అనే విషయాన్ని గ్రహించిన కృష్ణమూర్తి జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపనతో ముందుకు దూసుకుపోతున్నాడు. కృష్ణమూర్తి తను ఉత్పత్తి చేసిన రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తన కుటుంబీకులు నడిపే చిన్న దుకాణం ద్వారా స్థానికంగా విక్రయిస్తూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగం పంచుకొంటున్నాడు. కృష్ణ మూర్తి వ్యవసాయ విధానం తెలిసిన గ్రామస్తులు కృష్ణమూర్తి పండించే ఆకుకూరలు, కాయగూరలను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. అధిక స్థాయిలో ఉత్పత్తులు వస్తే కుప్పం మార్కెట్ కు తరలిస్తున్నాడు. అందుకే దేశవిదేశాల నుంచి సందర్శకులు వచ్చి కృష్ణమూర్తి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. పత్రికలు కూడా భారీ కవరేజ్ ఇస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
డ్రిప్ పద్ధతిలో రిలే సోయింగ్ చేస్తూ కేవలం 15 వేల రూపాయల ఖర్చుతో రెండు ఎకరాలలో ఏడాది కాలంలో 2 లక్షల 80 వేల రూపాయల నికర ఆదాయం పొందిన కృష్ణమూర్తి వ్యవసాయ విధానం గురించిన పూర్తి వివరాలు తెలుసుకొందాం.
• ఏ గ్రేడ్
• విస్తీర్ణం: 0.50 సెంట్లు
• ప్రధాన పంటలు: 5 రకాలు (మునగ, అరటి,బొప్పాయి,కరివేపాకు,ఆముదం)
• బయో డైవర్శిటీ పంటలు: 20
• (కొత్తిమీర, పాలకూర, మెంతికూర, గోంగూర, అవిసె, సంబారం, కుచ్చిక లంగు, చామదుంప,కందగడ్డ. టొమాటో, మిరప, వంగ, అలుసంద,బంతి, రాగి,కాలీఫ్లవర్,బీర, నువ్వులు,ఉద్దులు, అనుములు,కంది,పుచ్చకాయ,కాకర,ఉల్లి, ముల్లంగి)
• ఏటీఎం
• విస్తీర్ణం: 20 సెంట్లు
• ప్రధాన పంటలు: ఉల్లి, క్యారెట్, ముల్లంగి
• అంతర పంటలు: చామదుంప, కందగడ్డ, బీట్రూట్,మొక్కజొన్న,బెండ,గోరుచిక్కుడు,ఎరపంటలు, సజ్జ, అల్లం , 4 రకాల ఆకుకూరలు
• షేడ్ నెట్ లో
• విస్తీర్ణం: 16 సెంట్లు
• పంట రకాలు: నేతిబీర, చిక్కుడు, కాకర, సొర, బీన్స్,టొమాటో
• పీఎండీఎస్ వరి : బ్లాక్ రైస్ మరియు బ్రౌన్ రైస్
• ప్రయోగాలు చేస్తూనే ఉంటా….
• జీవితంలో ఏదైనా సాధించాలి. నిరంతర కృషి తో ప్రయోగాలు చేస్తూ ఉంటా. ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు వెళతా. సమీప భవిష్యత్ లో ఒక ఎకరా విస్తీర్ణంలో పూర్తిగా పండ్ల మొక్కలు పెంచాలని లక్ష్యంగా ఎంచుకొన్నా. నేను మరో మెంటార్ గా ముగ్గురు హోస్ట్ ఫార్మర్స్ కు సలహాలు, సూచనలు అందిస్తున్నాను అని కృష్ణమూర్తి తన అభిప్రాయం వెలిబుచ్చాడు.
ప్రాధమిక వివరాలు
• రైతు పేరు: జి. కృష్ణమూర్తి
• హోదా : మెంటార్
• గ్రామం: సీగలపల్లి
• యూనిట్ : సామగుట్టపల్లి
• మండలం : కుప్పం
• జిల్లా : చిత్తూరు
• మొత్తం పొలం : 4 ఎకరాలు
• ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విస్తీర్ణం : 4 ఎకరాలు
• నీటి వసతి : బోర్ వెల్
• నేల రకం : ఎర్రనేల
• పశుసంపద: 40 కోళ్ళు, 2 దేశీ ఆవులు
• అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు : ఏ గ్రేడ్, ఏ టీ ఎం
• అదనపు వ్యవహారం: ఎన్ పీ ఎం దుకాణం నడపడం