Mizoram Hmangaihzuali: బంగ్లాదేశ్‌లోని మహిళల కోసం ప్రతిష్టాత్మకమైన ఏషియన్ యూనివర్శిటీలో ప్రవేశానికి స్కాలర్‌షిప్ పొందిన ఐదుగురు గ్రహీతలలో మిజోరంలోని ఒక చిన్న రైతు కుమార్తె కూడా ఉన్నారు. ఆమెకు సింజెంటా రూ. 2.8 కోట్లు స్కాలర్‌షిప్ అందించనుంది. సింజెంటా… ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు ట్యూషన్, రూమ్ మరియు బోర్డ్, హెల్త్ కవరేజ్, పాఠ్యపుస్తకాలు మరియు సామాగ్రిని కవర్ చేస్తుంది.
మిజోరంలోని థింగ్సుల్ నివాసి అయిన హ్మంగైజువాలి మహిళా ఏషియన్ యూనివర్సిటీ లో చేరారు. ఈ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, తత్వశాస్త్రం & ఆర్థికశాస్త్రం మరియు పబ్లిక్ హెల్త్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ను అభ్యసిస్తారు. ఇది వినూత్నమైన నిపుణులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. అయితే నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ బంగ్లాదేశ్‌లో ఈ ప్రతిష్టాత్మక సింజెంటా స్కాలర్‌షిప్ కు ఎన్నికవ్వడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అని అంటుంది హ్మంగైజువాలి. హ్మంగైజువాలి మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ మంచి విశ్వవిద్యాలయానికి వెళ్లాలని కలలు కన్నాను. సింజెంటాకు ధన్యవాదాలు. నా కల నిజమైంది అని హ్మంగైజువాలీ అన్నారు.
Also Read: పశువైద్య శాస్త్ర రంగాలకు రూ.80,000 స్కాలర్‌షిప్
సింజెంటా స్కాలర్‌షిప్ ట్యూషన్, రూమ్ మరియు బోర్డ్, హెల్త్ కవరేజ్, పాఠ్యపుస్తకాలు మరియు ఐదుగురు విద్యార్థులకు సామాగ్రిని అందిస్తుంది. కాగా ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక మార్పులను సాధించడంలో గ్రామీణ మహిళలు కీలకం. వారికి సాధికారత కల్పించడం అనేది కుటుంబాలు మరియు గ్రామీణ సమాజాల శ్రేయస్సుకే కాకుండా మొత్తం ఆర్థిక ఉత్పాదకతకు కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శ్రామికశక్తిలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సింజెంటా మరియు ఏషియన్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ గ్రామీణ మహిళలను నాణ్యమైన విద్యకు పరిచయం చేసి రేపటి నాయకులుగా తీర్చిదిద్దేందుకు సాధికారతను అందిస్తున్నారు. ఇకపోతే హ్మంగైజువాలి మహిళా సాధికారతకు మరియు వ్యవసాయంలో నిమగ్నమైన లక్షలాది మంది మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది.
Also Read: చైనా విద్యార్థులకు పందులను బహుమతిగా ఇచ్చిన టీచర్లు