Kiwi Cultivation: అందరూ వ్యవసాయం దండుగ అంటూ హేళన చేస్తుంటే.. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించింది ఆమె. నేటితరంలో సాఫ్ట్ వేర్ రంగం తప్ప మరేరంగం లేదన్నట్లుగా ఆలోచించే వారికి ఛాలెంజ్ చేసి వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది. నేటి యువత తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లేదా మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇవన్నీకాకుండా సొంత గడ్డపై కెరీర్‌ని సిద్ధం చేసుకోవాలని భావించిన ఓ కాశ్మీరీ యువతి రైతుగా మారి విజయపతాకాన్ని ఎగురువేస్తోంది.
దేశ విదేశాల్లో మాంద్యం కాలం కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ కాశ్మీర్‌కు చెందిన ఒక అమ్మాయి తన భూమిలో కివీ నర్సరీని ప్రారంభించింది. 24 ఏళ్ల కాశ్మీరీ యువరైతు గౌహర్ జబీనా కివీ పంట సాగుతో విజయ పథంలో దూసుకుపోతోంది.
జబీనా సొంతంగా స్వయం ఉపాధిని ప్రారంభించి కాశ్మీర్ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వ్యాపారం గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదని జబీనాకు వ్యవసాయంతో అనుబంధం ఏర్పడిరది. ఈ అనుబంధం కారణంగా, ఆమె దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని డబ్రూనా ఆషాజిపోరా ప్రాంతంలో కివీ ఫ్రూట్ నర్సరీని ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది.
ఆమె ‘‘గ్రీన్ పోష్ నర్సరీ యూనిట్’’ పేరుతో ఓ నర్సరీని ప్రారంభించింది. ఈ నర్సరీలో, కివీతో పాటు, వాల్‌నట్, నేరేడు వంటి పండ్లను కూడా పండిస్తుంది.
గౌహర్ జబీనా.. కాశ్మీర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంఎస్‌సి చేసింది గౌహర్ జబీనా.. కొంతమందితో కలిసి మొదటిసారిగా దక్షిణ కాశ్మీర్‌లోని గౌహర్ జబీనా వినూత్నపద్ధతిలో పంటలను పండిరచడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కివి సాగు చేయడం మొదలు పెట్టింది. అంతేకాదు ఈమె రైతు సోదరులకు కివి సాగును సులభతరం చేయడానికి ఎస్‌కెయుఎఎస్‌టి కొన్ని ప్రయోగాత్మక తోటలను అభివృద్ధి చేసింది.
అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలి..
Also Read: Agri Export-Import in India 2022: ఒడుదొడుకులు లేని అంతర్జాతీయ విపణి

Kiwi
‘అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలి. వారు తమ స్వంత చేతులతో సంపాదించాలి, అమ్మాయిలకు వారి స్వంతంగా ఏదైనా చేయమని జబీనా చెబుతోంది. జబీనా వ్యవసాయ రంగంలో లాభాలు ఆర్జిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న జబీనా తమ కాళ్లపై నిలబడాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చింది. కివీ వ్యాపారంలో ఆసక్తి కలిగి ఉన్న మహిళలకు, యువతులకు ప్రత్యేకంగా కివీ సాగుపై ట్రైనింగ్ ఇచ్చింది.
కాశ్మీర్‌లో ప్రతిరోజూ కివీ ధర పెరుగుతోంది. ఇక్కడి మార్కెట్‌లో డజెన్ కివీ పండ్ల ధర దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ఆయా సైజులను బట్టి ధర నిర్ణయిస్తారు. ఒక కివీ సాధారణ ప్రజలకు 30 నుంచి 40 రూపాయలకు అందుబాటులో ఉంది. రేటు పెరిగినప్పుడు, కివీ దాదాపు 50 రూపాయల వరకు పలుకుతుంది.
స్వతంత్రంగా ఉండేందుకు వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఆమె షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నప్పుడు, తన సొంతగా వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నది జబీనా. అందుకోసం మార్కెట్లో కివీకి ఉన్న డిమాండ్‌ను చూసింది. ఆసమయంలోనే కివి పండ్లను ఎందుకు పండిరచకూడదని అనుకున్నది. ఆ సమయంలో ఆమెను చాలామంది వ్యవసాయం దండుగ వస్తుంది.. మరేదైనా వ్యాపారం చేయడం ఉత్తమం అని ఉచిత సలహాలు ఇచ్చారు. అయినా ఏమాత్రం వెనకడుగువేయకుండా జబీనా ముందుకు సాగింది.
అనుకూల వాతావరణం..
కాశ్మీర్ వాతావరణం కివీ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంది. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ కూడా కివీ సాగు చేయడానికి చాలా అనువుగా ఉంటుందని జబీనా చెబుతోంది.
ఇలా చేస్తే కివి సాగులో మీకు మంచి లాభాలు వస్తాయి
జబీనా నర్సరీలో ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వందల జతల మగ, ఆడ కివి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైతు సోదరులు, ఆమె వద్దకు వస్తుంటారు. ఇప్పటి వరకు జబీనా తన నర్సరీలోని వందలాది మొక్కలను విక్రయించింది. ప్రస్తుతం జబీనా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ సరికొత్త విజయాలను సొంతం చేసుకుంటోంది.
కివీ సాగు ద్వారా ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే, మగ, ఆడ మొక్కలను కొనుగోలు చేయాలని జబీనా సూచిస్తోంది. ఏ పని చేసినా దానిపై పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని ఆమె చెబుతోంది.
Also Read: Mobile Rice Milling Machine: రైతు వద్దకే రైస్ మిల్.. పొలం వద్దనే బియ్యం పట్టించుకోవచ్చు