Organic Farming: ఉద్యోగాల కోసం యువత, కూలీ పనుల కోసం కార్మికులు పని దొరికే పట్టణాలకు పెద్దఎత్తున వలసపోవడం మనం ప్రతి చోటా చూస్తూనే ఉంటాం. వెనుకబడిన రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఝార్ఖండ్ లోని కోటింగ్ సెరా గ్రామంలో కూడా ఏటా వందలాది మంది వలస వెళ్లేవారు. వారిని చూసి ఏదైనా చేయాలని జ్యోతి ఆలోచన చేసింది. అంతటితో ఆగలేదు. సేంద్రీయ సాగు చేపట్టి వలసలకు అడ్డుకట్ట వేసింది. ఆమె సక్సెస్ స్టోరీ ఒక్కసారి చూద్దాం.
వర్షాలే తక్కువ
ఝార్జండ్ లోని సెరా గ్రామంలో ఎటు చూసినా కరవు పరిస్థితులే. నీటి వసతి తక్కువ. అంతా వలసలు పోయి జీవిస్తూ ఉంటారు. కోవిడ్ సమయంలో పనులు లేక గ్రామ వాసులు పస్తులుండాల్సి వచ్చింది. గ్రామస్థుల ఆకలి కేకలు జ్యోతిని కదలించాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే అందరూ గ్రామంలోనే ఉంటారని జ్యోతి భావించింది. వెంటనే సేంద్రీయ సాగుపై అవగాహన పెంచుకుంది. గ్రామస్థులను ఒప్పించి వారితో సేంద్రీయ సాగు చేపట్టేలా జ్యోతి చేసిన ప్రయత్నం ఫలించింది.
సేంద్రీయ సాగుపై శిక్షణ
కాంప్రహెన్సివ్ లైవ్లీ అడాస్టేషన్ పాత్ వే కొద్దిపాటి నీటితో సేంద్రీయ సాగు పద్దతులను ఉచితంగా రైతులకు నేర్పించింది. రసాయన ఎరువుల ఖర్చు లేకపోవడంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే కాదు, సాగు ఖర్చులు కూడా గణనీయగా తగ్గాయి. దీంతో రైతులు సేంద్రీయ సాగులో పట్టు సాధించారు. గ్రామంలో ముఖ్యంగా మహిళా రైతులు సేంద్రీయ సాగుపై ఆసక్తితో
గ్రూపులుగా ఏర్పడి పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
Also Read: Fisheries Incubation Centre: ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్ కు ₹10 కోట్ల గ్రాంట్ చేసిన KUFOS
వలసలకు అడ్డుకట్టపడింది
సెరా గ్రామంలో మహిళలు చేపట్టిన సేంద్రీయ సాగు సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే 150 మంది మహిళలు సేంద్రీయ సాగుతో ముందడుగు వేశారు. దీంతో గ్రామం నుంచి మగవారి వలసలు పూర్తిగా తగ్గిపోయాయి. గ్రామంలోనే సంవత్సరం పొడవునా పనులు దొరుకుతున్నాయని కూలీలు చెబుతున్నారు. అంతేకాదు. వీరిక అక్కడి ప్రభుత్వ సహకారం కూడా తోడు కావడంతో సేంద్రీయ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించుకుని మంచా ఆదాయం పొందుతున్నారు.
రసాయనాలు లేని సేంద్రీయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు సమీప ప్రాంతాల వాసులు ఎగబడుతున్నారు. సెరా గ్రామస్థులకు ఉన్న కొద్దిపాటి జాగాలోనే అదిక దిగుబడులిచ్చే పంటలను సేంద్రీయ పద్దతిలో సాగు చేయడంలో ఆ గ్రామ మహిళలు మంచి నైపుణ్యం సాధించారు. దీంతో సెరా గ్రామం పేరు దేశ వ్యాప్తమైంది. సెరా గ్రామస్థులు చూపిన బాటలో మరికొన్ని గ్రామాలు పయనిస్తున్నాయి. ఇలా రాబోయే పదేళ్లలో సగం పంట సేంద్రీయ పద్దతిలోనే తీయాలని ఝార్ఖండ్ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.
Also Read: Chilli Exports: మిర్చి అ’దర’హో ఈఏడాది ఎగుమతులు పదివేల కోట్లు.!