Innocent Farmers: దున్నపోతు ఈనిందంటే రాజకీయ నాయకులు దూడనికట్టేమంటార. రైతులు ఆందోళన చేస్తే అది అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేక చర్యగా ప్రతిపక్ష రాజకీయ నాయకులు ప్రకటిస్తారు. రైతులు ఆందోళన కేవలం వారి సమస్యలు పరిష్కారం కోసంచేసే ప్రయత్నం! ఏ రాజకీయ పార్టీకి లేదా, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు కు వ్యతిరేకం కాదు! ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, డాక్టర్లు యాక్టర్లు, నిరంతరం ఆందోళన చేస్తుంటారు. వీరి విషయాల్లో రాజకీయ పార్టీలు, నాయకులు జోక్యం చేసుకుని నివ్వరు. నోరు మూసుకుని ఉంటారు. దీనిని ఆ సంఘాల హక్కుల పోరాటం అని అంటారు.
రైతులు నిరసన తెలియజేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేక పోరాటమని చెప్పటం చాలా బుద్ధిహీనత, అవివేకం. రైతు సమస్యలను ప్రస్తుతమున్న ప్రభుత్వాలు పార్టీలు నాయకులు బాధ్యులు కారు. గత 30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఉన్న లోపాల వలన రైతులకు ఆర్థిక స్థిరత్వం, సామాజిక గుర్తింపు పొందలేకపోయారు పోయారు.
Also Read: Ginger Farmers: అల్లం రైతుల ఇబ్బందులు
రైతులను కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, వర్గాలుగా విడదీశారు. అందువలన రైతు సమస్యలకు సక్రమమైన పరిష్కారం కనపడలేదు. రాజకీయ పార్టీలు, నాయకులు రైతు సమస్యల విషయంలో వారికున్న హద్దులను తెలుసుకోవాలి. 1990 తరువాత భారత పారిశ్రామిక సేవా రంగాలు 10% శాతం అభివృద్ధి పొందింది. కానీ వ్యవసాయ రంగం కేవలం 2% లో నిలిచిపోయింది. దీనికి గత 30 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోలేదు.
ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు నాయకులు గతంలో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రులుగా కూడా ఉన్నారు, వీరు ఎవరు కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు, అభివృద్ధి ప్రణాళికలు, ఎగుమతులకు మార్పులు తీసుకు రావడంలో విఫలం అయిపోయారు. అధికారంలో ఉంటే అన్నీ సాధించామని, ప్రతిపక్షములో ఉంటే ప్రభుత్వం విఫలమైందని ప్రతినిత్యం చెబుతున్నట్లు ఈ రాజకీయ నాయకుల ప్రవర్తన చూసి రైతులు విసిగిపోయారు, అసహ్యించుకుంటున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి మీరందరూ సహకరించాలి, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం మంచిది కాదు.
కోనసీమ రైతు నిరసన అనేక కారణాల వల్ల జరుగుతున్నది.ఈ క్రింద పేర్కొన్న పరిస్థితులు తెలంగాణ రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వరి పంట పండించుట వలన కనీస ఖర్చులు కూడా రావడం లేదు. ప్రతి సంవత్సరం ఎరువులు, పురుగు మందులు, కూలీలు, డీజిల్, ట్రాక్టర్ బాడుగ దాదాపు 50 % అధికంవుతున్నది. దీనితో సమానంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను పెంచటం లేదు. పంటల మద్దతు ధరల ను 2007 డాక్టర్. ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సూచన మేరకు లాభసాటి ధరగా నిర్ణయించుట కాంగ్రెస్ మరియు బి.జె.పి పరిపాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు.రైతు కోరేది లాభసాటి ధర మద్దతు ధర కాదు!రైతులు బిచ్చగాళ్లు కాదు వారికిపంట ఖర్చు, దానిపై లాభం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి.
2021 వరి ఉత్పత్తి ఖర్చు భూమి విలువపై వడ్డీ, (కౌలు ) యాజమాన్య ఖర్చు ,విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, ట్రాక్టరు బాడుగలు కలిసి 1 Quintal ఖర్చు 2000 రూపాయలు ఉన్నది. కానీ మద్దతు ధర కేవలం1940 (Common variety Paddy) రైతులు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతులు చేయుటకు ప్రభుత్వాలు అడ్డంకులు కలిగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను వరి రైతులకు అందుబాటులో చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ, సేవా రంగాల ఎగుమతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు పంటల ఎగుమతులకు ఇవ్వడం లేదు. వరి పంట ధరలను కృత్రిమంగా అదుపులో ఉంచుకున్నారు.
పంట ఉత్పత్తి పెంచుటకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయటం లేదు. చైనాలో హెక్టారుకు 6.49 టన్నుల ఉత్పత్తి సాధించగా భారతదేశంలో కేవలం 2.72 టన్నుల ఉత్పత్తి ఉన్నది.
1990 తరువాత రైతులకు, ఉద్యోగులు, వ్యాపారులు తో సమానంగా ఆర్థిక ప్రగతి, సామాజిక గుర్తింపు లేదు.
రైతు బాధ, కష్టాలు, అలక్ష్యం, నిరసన ప్రభుత్వాలకు తెలియజేసేందుకు వరి రైతులు అందరూ ఐక్యతగా చేపట్టనున్న కోనసీమ ఉద్యమం. ప్రభుత్వాలు రైతుల కోర్కెలను డిసెంబర్ 2022 నాటికి పరిష్కారం చేయనిచో, ఈ నిరసన కార్యక్రమం 2023 లో కూడా కొనసాగింపబడును.
తెలుగు రాష్ట్రాల వరి రైతుల కోరికలు:
Demands:-
(1)పనికి ఆహార పథకాన్ని MGNREGA వరి పంట కూలీలకు అనుగుణంగా వసతి కల్పించాలి.
(2) వరి మద్దతు ధరను లాభసాటి ధర గా డాక్టర్ స్వామినాథన్ సూచనమేరకు నిర్ణయించాలి.
(3) ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలు రిపేరు చేయుటకు ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టడం లేదు.
(4) ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలి.
(5) కేంద్ర ప్రభుత్వం వరి ఎగుమతులపై నిషేధం విధించే కూడదు.దీర్ఘకాలిక ఎగుమతులకు వసతి ఏర్పాటు చేయాలి.
(6) ట్రాక్టర్ ఉన్న రైతులకు 5,000 లీటర్ల డీజిల్ 50 శాతం ధర.
సూచన:- ప్రతి రైతు ఎందుకు పంట పండించుట లేదో వీడియో ద్వారా వివరాలు తెలియజేస్తూ నిరసన Facebook, ట్విట్టర్ ఇతర సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకు, పార్టీలకు, ఉద్యోగులకు, న్యాయస్థానాలకు తెలియజేస్తున్నారు. ఇది రైతు నిరసన తెలియజేసే కొత్త విధానం !!!
పెద్దిరెడ్డి చెంగల్ రెడ్డి,
Advocate & ప్రధాన సలహాదారులు,
అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య.
Also Read: Farmers Advisory: రైతులకు ICAR శాస్త్రవేత్తల విలువైన సూచనలు