Indian Young Farmers Forum: వ్యవసాయ రంగం దండగ కాదు పండగ అని నిరూపించేందుకు యువరైతులు ముందుకొస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన కొందరు యువకులు లక్షల్లో జీతాన్ని కాదని తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయంలో కొన్ని పద్ధతులు పాటించి మంచి ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తూ ఈ రంగానికి యువరైతుల సహాయం అవసరం ఉందని అంటున్నారు.

Indian Young Farmers
తమిళనాడు వాసి ప్రదీప్ కుమార్ కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. పట్నంలో మంచి ఉద్యగం చేస్తున్నప్పటికీ ప్రదీప్ కు మాత్రం తన కరూర్ గ్రామంలో బీడుపడిన 5 ఎకరాల భూమిని సాగు చేయాలనీ కలలు కనేవాడు. దీంతో ఉద్యాగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చి ఫుల్‌టైమ్ రైతుగా మారాడు. స్థానిక సంప్రదాయ జాతులను కాపాడుకోవడానికి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ప్రదీప్ కుమార్ ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతున్నాడు. విజయవంతమైన రైతుగా తనను తాను నిరూపించుకున్నాడు.
కేరళ పాలక్కడ్ నివాసి శరవణన్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా గుర్తించింది. శరవణన్ అరటి, జామ సాగులో కొత్త పద్దతులను పాటించి ఆదర్శ రైతుగా మారాడు. దాంతో అయన కేరళ ప్రభుత్వాన్నే ఆకర్షించాడు.

Indian Young Farmers Forum
ఇక బెంగళూరులో ఉద్యోగం చేసే కైలాస్‌నాథ్ నిర్జీవంగా పడి ఉన్న తన పొలాలకు ప్రాణం పోశాడు. స్వగ్రామం నర్సిపురాన్ని వదిలి బెంగుళూర్ లో కైలాష్ నాథ్ వ్యవసాయం మీద మక్కువతో మళ్ళీ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు.
Also Read: నల్లమందు నుంచి నిమ్మగడ్డి సాగు – యాదవ్ స్టోరీ
చంద్రశేఖరన్ సర్వణన్ పొలాచ్చిలో చింత, జామ, సపోట…మొదలైన చెట్లను ఇష్టంగా సాగు చేస్తున్నాడు. ఆయనకు పదిహేను ఎకరాల ఫుడ్ ఫారెస్ట్ కూడా ఉంది. దేశదేశాల్లోని వ్యవసాయవిధానాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపే చంద్రశేఖరన్‌కు యువత వ్యవసాయంలోకి రావాలని కోరుతున్నాడు. కాగా తన కలను నెరవేర్చుకోవడానికి చంద్రశేఖరన్ ఇండియన్ యంగ్ ఫార్మర్స్ ఫోరమ్ ను కూడా మొదలుపెట్టాడు. అతనికి అయన వ్యవసాయ క్షేత్రంలో గడపడం ఎంతో ఇష్టమని చెప్తున్నాడు.

Farming
అయితే చంద్రశేఖరన్ ఫోరంలో పైన ప్రస్తావించిన ప్రదీప్ కుమార్, కైలాస్‌నాథ్,శరవణన్ మరియు ఇతర యువకులు ఎందరో అతని ఫోరమ్ లో చేరారు. వారు యువ రైతులకు ధైర్యం చెప్తూ వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యత గురించి అవగాహనా కల్పిస్తున్నారు. తమ వ్యవసాయ క్షేత్రాన్నే బడిగా మలిచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువరైతులకు పాఠాలు చెప్తున్నారు. సంతోషకర విషయం ఏంటంటే.. నవీన సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేశారు. ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పారు. ఈ ఫోరమ్ ప్రభావంతో పట్నంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న యువకులు తమ పూర్వీకుల పంటపొలాలను వెదుక్కుంటూ వస్తున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా విస్తరించాలనేది ఫోరమ్ లక్ష్యాల్లో ఒకటి అని చంద్రశేఖరన్ చెప్తున్నారు.
Also Read: ఎకరం విస్తీర్ణంలో సమీకృత సేద్యం చేస్తు స్ఫూర్తిగా నిలుస్తున్న యువ రైతు.!